Published : 24/12/2022 00:14 IST

ప్లాస్టిక్‌ సీసాలే కానీ...

ఇంట్లో చాలా వస్తువుల్ని.. వాడకా నికి పనికి రావంటూ పక్కన పెట్టేస్తుంటాం. కానీ, మనసు పెట్టి ఆలోచించి, కాస్త సమయం పెట్టగలిగితే... అందమైన కళాకృతులెన్నో తయారు చేయొచ్చు. ఇవి అలంకరణకే కాదు.. అవసరానికీ  పనికొస్తాయి.

* తాగి పక్కన పాడేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో అందమైన నగల ఆర్గనైజర్‌ని తయారు చేయొచ్చు. ఇందుకోసం ఓ ఆరేడు బాటిల్స్‌ని శుభ్రంగా కడిగి ఆరనివ్వండి. ఆపై వాటి అడుగుభాగాల్ని కత్తిరించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు వాటిల్లో ఒకదాన్ని తిరగేసి మధ్యలో ఓ రంధ్రం చేసి...స్క్రూలు ఉన్న సన్నటి రాడ్‌తో బిగించుకోవాలి. అలా మిగిలిన వాటిని దానికి వ్యతిరేక దిశలో పెట్టి బిగిస్తే సరి. కింద ఉన్న సీసా భాగం స్టాండ్‌లా నిలబెడితే...మిగిలినవాటిల్లో నగలు సర్దేయొచ్చు. ఇలా కత్తిరించిన వాటితో పూలవాజునీ తయారు చేయొచ్చు.

* ప్లాస్టిక్‌ బాటిళ్లలతో అందమైన బుట్టల్నీ అల్లేయొచ్చు. ఈసారి ఆకుపచ్చ రంగు సీసాలను ఎంచుకోండి. వాటిని సమాన వెడల్పుతో పొడవుగా కత్తిరించుకుని కొబ్బరాకులూ, తాటాకులతో చేసే బుట్టల తరహాలో ఒకదానిపై మరొకటి పెట్టి అల్లేయండి. జాయింట్లను  గమ్‌తో అతికించొచ్చు. పిన్నులూ కొట్టొచ్చు. ఈ బుట్టల్లో పూలు పెట్టుకుంటే ఎంత బాగుంటాయో!

* వృథా ప్లాస్టిక్‌ బాటిల్‌తో వాల్‌హ్యాంగింగ్‌ తయారు చేయొచ్చు. సీసాను మధ్యకు కత్తిరించుకోవాలి. పై భాగాన్ని ఎంచుకుని అంచు చుట్టూ సమాన దూరం ఉండేలా దారం దూరేలా  రంధ్రాలు చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన వర్ణాన్ని పెయింట్‌గా వేసి ఆరనివ్వాలి. ఆరాక వాటిల్లో నుంచి రంగు ఊలు దారాల్ని బయటకు తీసి టాసిల్స్‌లా వేలాడదీయాలి.  మూతి దగ్గర సిల్వర్‌ లేదా గోల్డెన్‌ త్రెడ్‌ని చుట్టేసి..అక్కడక్కడా,  అంచుల్లోనూ అతికిస్తే ఆకట్టుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని