జుట్టు రాలడం.. పళ్లు పచ్చబడడం... చిట్కాలివిగో!
కాస్త ఓపిక ఉంటే చాలు.. నిత్యం మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలను ఇంటి చిట్కాలతోనే నయం చేసుకోవచ్చు. మన పెద్దలు ఇలాగే చేసేవారన్న విషయం తెలిసినా మనం పెద్దగా....
కాస్త ఓపిక ఉంటే చాలు.. నిత్యం మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలను ఇంటి చిట్కాలతోనే నయం చేసుకోవచ్చు. మన పెద్దలు ఇలాగే చేసేవారన్న విషయం తెలిసినా మనం పెద్దగా పట్టించుకోం. ఈ క్రమంలో ఇంటి చిట్కాలతోనే కొన్ని సమస్యలను ఏవిధంగా పరిష్కరించుకోవచ్చో చూద్దాం రండి..
కొబ్బరినూనెతో...
ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పరగడుపున కొబ్బరినూనెతో పుక్కిలించడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోవడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
టీ బ్యాగులతో...
చాలామంది మహిళలు కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని తొలగించుకోవడానికి రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. ఇలాంటివారు కిచెన్‌లోని టీ బ్యాగులతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. చల్లటి టీ బ్యాగులను కంటిపై పెట్టుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ట్యానిన్లు.. నల్లటి వలయాలు పోయేలా చేస్తాయి.
ఎక్కిళ్లు వస్తున్నాయా?
కొంతమందికి ఎక్కిళ్లు వచ్చాయంటే ఒక పట్టానా వదలవు. ఇలాంటప్పుడు సత్వర పరిష్కారం కోసం మంచినీళ్లను తాగుతుంటారు. అయితే మంచినీళ్లు తాగినా కూడా కొందరికి ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఒక టీ స్పూన్ పంచదారను చప్పరిస్తే పరిష్కారం లభిస్తుందట.
జుట్టు రాలుతోందా?
వయసుతో సంబంధం లేకుండా తమ జుట్టు రాలుతోందని ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి మనం కూరల్లో ఉపయోగించే ఉల్లిగడ్డలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. దీనికోసం ఉల్లిగడ్డను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను చీజ్ క్లాత్లో వేసి అందులోంచి రసం వచ్చేట్టుగా పిండాలి. ఆ రసాన్ని మాడుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గడంతో పాటు చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పళ్లు పచ్చగా ఉన్నాయా?
కొంతమంది పళ్లు పచ్చగా ఉంటాయి. దీనికోసం రకరకాల టూత్‌పేస్టులను ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివారు నలుగురిలో నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి మనం తినే యాపిల్ మంచి పరిష్కారం చూపిస్తుందని మీకు తెలుసా? యాపిల్ తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని తెలిసిందే. ఇదే యాపిల్ పళ్ల పైన పచ్చదనం తగ్గడానికి కూడా ఉపకరిస్తుందట. ఇందులో ఉండే ఒక రకమైన సమ్మేళనం అందుకు కారణమట.
అయితే ఇవన్నీ కేవలం ఇంటి చిట్కాలు మాత్రమే. ఆయా వైద్య చికిత్సలకు ఇవి ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఒకవేళ వీటిని పాటించినప్పటికీ ఆయా సమస్యలు పరిష్కారం కానట్లయితే- అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.