గొంతులో గరగర.. తగ్గాలంటే..??
వాతావరణంలో జరిగే మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటితో పాటు గొంతు గరగర కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనితో పాటు కళ్లు, ముక్కు.. వంటి భాగాల్లో దురదగా ఉంటుంది.
వాతావరణంలో జరిగే మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటితో పాటు గొంతు గరగర కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనితో పాటు కళ్లు, ముక్కు.. వంటి భాగాల్లో దురదగా ఉంటుంది. ఇవన్నీ సీజనల్ ఎలర్జీల లక్షణాలే.. ఈ గొంతు గరగరను, ఎలర్జీలను ఎదుర్కోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా సహకరిస్తాయి. అవేంటో తెలుసుకుందాం రండి..
విటమిన్ సి..
విటమిన్ సి నిండిన పండ్లను తినడం వల్ల గొంతులో గరగరను తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఎక్కువ మొత్తంలో యాంటీ హిస్టమైన్ ఉంటుంది. అందుకే ఇది ఎలర్జీలను కూడా క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే యాంటీ హిస్టమైన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా దొరుకుతుంది. కానీ వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడడం మంచిది.
ఉప్పు నీరు..!
ఎలర్జీ వల్ల గొంతుకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదా గొంతు వాచినప్పుడు.. కాసిన్ని గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం సమస్య తగ్గడంతో పాటు దాన్నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ సమయంలో శరీరంలో నీటి శాతం పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం.. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
అల్లం
గొంతునొప్పి తగ్గించే లక్షణాలు అల్లంలో కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు రోజూ అల్లాన్ని వంటల్లో ఉపయోగించడం మంచిది. లేదంటే కనీసం సాయంత్రం పూటైనా అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. లేదంటే అర చెక్క అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తీసుకున్నా ఫలితం ఉంటుంది. తేనె కేవలం ఎలర్జీలకే కాక ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
గ్రీన్ టీ
కేవలం బరువు తగ్గడానికే కాక ఎలర్జీలను తగ్గించడంలో కూడా గ్రీన్‌టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలర్జీని అరికట్టడంలో బాగా సహకరిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ గ్రీన్ టీని కనీసం ఒకట్రెండు కప్పుల చొప్పున తీసుకోవడం చాలా మంచిది.
పండ్లు, కూరగాయలు..
కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎలర్జీని తగ్గించడంలో చురుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా ద్రాక్ష, అరటి, టమాట, క్యారెట్, ఉల్లిపాయలు.. వంటి పదార్థాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పండ్లు, కూరగాయల్ని నేరుగా తినడం ఇష్టం లేకపోతే వాటిని జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే వీటిని తయారు చేసుకునే క్రమంలో వీలైతే చక్కెర వేసుకోకపోవడమే మంచిది.
ఒమేగా - 3 కూడా..!
ఒమేగా - 3 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఎలర్జీ తగ్గుతుంది. ఎలర్జీ రియాక్షన్లకు గురిచేసే రసాయనాలను నివారించే శక్తి ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాల్లో అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా లభించే వాల్నట్స్, ఫిష్ ఆయిల్, అవిసె గింజలు.. వంటి ఆహార పదార్థాలతో పాటు ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చిక్కుడు గింజలు.. మొదలైన వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
యాపిల్ సైడర్ వెనిగర్‌తో..
యాపిల్ సైడర్ వెనిగర్‌లో కేవలం ఎలర్జీని తగ్గించే గుణాలే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే ఎలర్జీల వల్ల కలిగే దురదను తగ్గించడంలో కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. బరువు తగ్గించడంలో, జుట్టు రాలకుండా కాపాడడంలో.. ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎలర్జీల వల్ల కలిగే దురదను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
వెల్లుల్లి..
ఎలర్జీ.. వంటి సమస్యల్ని తగ్గించడంలో వెల్లుల్లి చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకోసం పచ్చి వెల్లుల్లిని నేరుగా తినొచ్చు. కాబట్టి ఎలర్జీ సమస్యతో బాధపడేవారు రోజూ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తినడం అలవాటు చేసుకోవాలి. చాలామంది దీన్ని నేరుగా తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు ఈ రెబ్బల్ని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే.. సమస్య త్వరగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!