Published : 05/01/2022 18:53 IST

వీటితో చలికాలం సమస్యలకు పరిష్కారం!

చలికాలంలో చేతులు పొడిబారిపోవడం; పాదాలు, మడమలు పగలడం తెలిసిందే. ఈ సమస్యల నుంచి పరిష్కారం లభించాలంటే ఇలా చేసి చూడండి..

పాలతో పెడిక్యూర్!

చలికాలమొచ్చిందంటే పాదాలు, మడమల పగుళ్లతో చాలామంది బాధపడడం మనం గమనిస్తూనే ఉంటాం. అందుకు చక్కటి పరిష్కారం చూపుతుందీ పెడిక్యూర్. ఇందులో భాగంగా పాదాల్ని కాసేపు పాలల్లో నానబెట్టాలి. తద్వారా ఇందులోని లాక్టికామ్లం పాదాలు, మడమల గరుకుదనాన్ని పోగొట్టి వాటిని మృదువుగా మార్చుతుంది. ఆ తర్వాత బాదం నూనెతో మరికాసేపు పాదాలు, మడమల్ని మర్దన చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇది చలి వల్ల పొడిబారిపోయిన పాదాలకు తేమను, పోషణనందించడానికి చక్కగా ఉపకరిస్తుంది. ఇలా పాదాలు, మడమల విషయంలో మనం చేయించుకునే పెడిక్యూర్ ట్రీట్‌మెంట్ వల్ల శరీరానికి వెచ్చదనం కూడా అందుతుంది.

మానిక్యూర్ కోసం..

చలికాలంలో చేతులు కూడా పొడిబారిపోతుంటాయి. ఈ సమస్యను పోగొట్టడానికే వివిధ రకాల క్రీములు, బాడీ లోషన్లు రాసుకుంటూ ఉంటాం. అయితే ఇలా చేయడం వల్ల సమస్య నుంచి కాసేపు మాత్రమే ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే మళ్లీ సమస్య పునరావృతమవుతుంది. అంతేకాదు.. గోళ్లు కూడా ఈ చలికి నిర్జీవంగా తయారవుతుంటాయి. ఇలా జరగకుండా చేతులు, గోళ్లకు పోషణనందించాలంటే అందుకోసం ఈ మానిక్యూర్ పద్ధతిని ఎంచుకోవచ్చు.

పారాఫిన్ మైనంతో చేసే ఈ మానిక్యూర్ ప్రక్రియలో భాగంగా.. ముందుగా పారాఫిన్ మైనాన్ని ద్రవంగా మారేంతవరకు వేడిచేయాలి. ఆపై కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆ తర్వాత చేతులను ఆ వ్యాక్స్‌లో ముంచి వెంటనే తీయాలి. ఇలా వ్యాక్స్ చేతులకు మందంగా అంటుకునేంత వరకు ఆ మిశ్రమంలో చేతులు పెడుతూ, తీస్తూ ఉండాలి. ఆ తర్వాత గంట సేపటి దాకా అలాగే ఉంచుకొని మైనాన్ని చేతుల నుంచి తొలగించుకోవాలి. ఇప్పుడు లోషన్ రాసుకొని గ్లౌజులు వేసుకోవాలి. ఈ పద్ధతి చేతులతో పాటు గోళ్లకూ పోషణనందించి మృదువుగా మార్చుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని