దొండపండు లాంటి పెదాల కోసం..

'దొండ పండు లాంటి పెదవే నీదీ..' 'చెలి అధరాలు లేత పూ రేకులు..' అంటూ పెదాల అందాన్ని వర్ణించిన సినీకవులు ఎందరో.. మరి.. అంత అందమైన పెదాలను అందంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే.. ఎండలో ఎక్కువగా తిరగడం, లిప్‌స్టిక్‌లు అతిగా వాడటం

Published : 30 Sep 2021 16:15 IST

'దొండ పండు లాంటి పెదవే నీదీ..' 'చెలి అధరాలు లేత పూ రేకులు..' అంటూ పెదాల అందాన్ని వర్ణించిన సినీకవులు ఎందరో.. మరి.. అంత అందమైన పెదాలను అందంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే.. ఎండలో ఎక్కువగా తిరగడం, లిప్‌స్టిక్‌లు అతిగా వాడటం, కాఫీ, టీలు ఎక్కువసార్లు తీసుకోవడం.. ఇలా వివిధ కారణాల వల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం రండి..

ఇంట్లోనే ఇలా..

పెదాలు కాస్త నలుపు తగ్గాలంటే బీట్‌రూట్ జ్యూస్, దానిమ్మ గుజ్జు, కొత్తిమీర రసాన్ని రోజూ పెదాలపైన రాస్తూ ఉండాలి. వీటిని వాడటం వల్ల పెదాలు ఎర్రగా మారే అవకాశాలుంటాయి. దీంతో పాటు తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాసుకోవడం వల్ల నలుపు రంగు తగ్గుతుంది.

మాయిశ్చరైజేషన్

పెదాలకు తగినంత తేమ లేకపోవడం వల్ల కూడా నల్లగా మారతాయి. దీనికోసం లిప్ బామ్, బాదం నూనెని అప్లై చేయడం వల్ల పెదాలకు తగినంత తేమ అందుతుంది. దీంతో పాటు రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయి.

స్క్రబింగ్

పెదాలకు స్క్రబింగ్ ఏంటనుకుంటున్నారా? స్క్రబింగ్ అంటే చర్మానికి చేసినట్టు కాకపోయినా 'ఎక్స్‌ఫోలియేషన్' చేయండి. అదెలా అంటారా? మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తీసుకోండి. పెదాలను కాస్త తడి చేసుకొని ఆ బ్రష్‌తో పెదాలను రుద్దండి. తర్వాత లిప్ బామ్ రాసుకోండి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల పెదాలు అందంగా ఉంటాయి.

హెల్దీ డైట్

పెదాలు ఆరోగ్యంగా కనిపించాలంటే మనం తినే ఆహారం మీద కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. దీని కోసం పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఖర్జూరాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవడమూ మంచిదే. దీనికోసం ఒక కప్పు వేడినీటిలో ఆరు ఖర్జూరాలను నానబెట్టి అరగంట పాటు ఉంచండి. తర్వాత ఆ నీళ్లను తాగితే మీ పెదాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఎండ నుంచి కాపాడుకోండి..

పెదాలు నల్లబడటానికి ఎండ కూడా కారణమవుతుంది. అందుకే మీ పెదాలను ఎండ నుంచి కాపాడుకోండి. సన్‌స్క్రీన్ లోషన్‌ని వాడటం కూడా మంచిదే.. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం, వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ లాంటివి ఉపయోగించడం వల్ల పెదాలు నల్లగా మారకుండా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్