మెడ నలుపు తగ్గించే ఇంటి చిట్కాలు!
సరైన పరిశుభ్రత పాటించకపోవడం, వాతావరణ కాలుష్యం, పలు దీర్ఘకాలిక సమస్యలు.. వంటివి అందానికి అవరోధాలుగా మారుతుంటాయి. మెడ చుట్టూ నల్లగా మారడం కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా......
సరైన పరిశుభ్రత పాటించకపోవడం, వాతావరణ కాలుష్యం, పలు దీర్ఘకాలిక సమస్యలు.. వంటివి అందానికి అవరోధాలుగా మారుతుంటాయి. మెడ చుట్టూ నల్లగా మారడం కూడా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
పెరుగుతో..
కొద్దిగా పెరుగు తీసుకొని దానికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడపై రాసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. పెరుగు మాయిశ్చరైజర్‌లా పనిచేయడంతో పాటు చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది.
నిమ్మరసంతో..
శుభ్రమైన కాటన్‌బాల్‌తో మెడ చుట్టూ నిమ్మరసాన్ని అప్త్లె చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అయితే నిమ్మరసం రాసుకున్న తర్వాత చర్మంపై ఎండ ప్రభావం లేకుండా చూసుకోవాలి. నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్, క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న మృతకణాలు, జిడ్డు, మురికిని సులభంగా తొలగిస్తుంది.
ఇవి కూడా..
* కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని.. దానికి కొన్ని చుక్కల నీటిని కలపాలి. ఈ మిశ్రమంతో మెడను కాసేపు మర్దన చేసుకొని వేడినీటితో కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు బదులుగా బాదం, ఆలివ్ నూనెలను కూడా వాడచ్చు.
* నిమ్మరసం, రోజ్‌వాటర్‌లను సమపాళ్లలో కలిపి రోజూ రాత్రి నిద్రపోయే ముందు మెడకు రాసుకోవాలి. ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మెడపై ఏర్పడిన నలుపు క్రమంగా తగ్గిపోతుంది.
* బాదం నూనెను గోరువెచ్చగా వేడిచేసి, దాంతో పది నిమిషాల పాటు మెడను మర్దన చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.