Published : 12/12/2022 21:05 IST

నిగనిగలాడే కురుల కోసం..!

నిగనిగలాడే నల్లటి వాలు కురులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లతో పాటు మారుతోన్న జీవనశైలి ప్రభావం కురులపై కూడా పడుతోంది. వీటికి తోడు స్త్టెలింగ్ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కేశాలను నిర్జీవంగా మార్చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా ఇంట్లోనే సులభంగా చేసుకునే హెయిర్‌ప్యాక్‌ను ప్రయత్నించి చూడండి.

కావాల్సినవి:

⚛ కోడిగుడ్డు సొన - 1

⚛ తేనె- ఒక చెంచా

⚛ ఆలివ్ ఆయిల్ - ఒక చెంచా

⚛ ఆముదం నూనె - ఒక చెంచా

⚛ ఆర్గన్ ఆయిల్- ఒక చెంచా

తయారీ:

ముందు కోడిగుడ్డు సొన ఒక పాత్రలో వేసుకుని బాగా గిలకరించాలి. తర్వాత తేనె, ఆలివ్ ఆయిల్, ఆముదం నూనె, ఆర్గన్ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత మంచి షాంపూ, కండిషనర్‌తో జుట్టుని శుభ్రపరుచుకుంటే సరి.. నిగనిగలాడే కురులు సొంతమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని