hormonal imbalance: హార్మోన్ల సమస్యా..

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువే. అధిక ఒత్తిడి, నెలసరి, గర్భధారణ.... వంటి వివిధ సందర్భాల్లో మనకు ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది.

Updated : 13 Apr 2024 15:39 IST

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువే. అధిక ఒత్తిడి, నెలసరి, గర్భధారణ.... వంటి వివిధ సందర్భాల్లో మనకు ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఈస్ట్రోజెన్‌ స్థాయులు పెరిగేందుకు మందులు వాడతాం... కానీ, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నా సరిపోతుందని అంటారు పోషకాహార నిపుణులు అదెలాగంటారా?

వెల్లుల్లి... కూరలూ, పచ్చళ్లు, పాస్తా, సూపులు, సలాడ్‌లు...ఏ రకమైన ఆహారపదార్థమైనా సరే అందులో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. వీటిల్లో ఉండే ఐసో ఫ్లేవనాయిడ్లు మహిళల్లో ఈస్ట్రోజెన్‌ స్థాయిని పెంచుతాయి. ఎముకల్ని కూడా పటిష్టంగా ఉంచుతాయి.

తాజా కూరగాయలు..  క్యాలీఫ్లవర్‌, బ్రకలి, మొలకలు వంటివి రోజూ తీసుకోవాలి. ఇవి క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. వీటి నుంచి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అన్ని కూరగాయలనూ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు..హార్మోన్ల అసమతుల్యతను అధిగమించొచ్చు. 

డ్రైఫ్రూట్స్‌... పిస్తా, బాదం, అంజీరా వంటి డ్రైఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్‌ శాతాన్ని పెంచేందుకు సాయపడతాయి. రోజూ కొంత పరిమాణంలో నట్స్‌ నానబెట్టి తీసుకుంటే శరీరానికి చాలా మేలు చేస్తాయి.

అవిసె గింజలు.. ఈస్ట్రోజెన్‌ అధికంగా అందించే వాటిలో అవిసెగింజలు ముందుంటాయి. అవిసెల్లో లిగ్నెన్స్‌ శాతం ఎక్కువ. ఇవి ఈస్ట్రోజెన్‌ను పెంచేందుకు సాయపడతాయి. రాత్రి ఒక చెంచా గింజల్ని నీళ్లల్లో నానబెట్టి పరగడపున తీసుకుంటే సరి. ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఇవి చెక్‌ పెడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్