Flax Seeds: అవిసెలతో బరువు దూరం!

సూపర్‌ఫుడ్‌గా పిలుచుకునే అవిసె గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిని వివిధ రూపాల్లో మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

Published : 08 Apr 2023 00:18 IST

సూపర్‌ఫుడ్‌గా పిలుచుకునే అవిసె గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిని వివిధ రూపాల్లో మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అవేమిటో చూద్దామా!

టీ.. గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకొని రెండు నిమిషాలు మరిగించండి. అందులో కొద్దిగా దాల్చిన చెక్క, అవిసె గింజల పొడి వేసి మరికొద్ది సేపు మరగనివ్వండి. అప్పుడప్పుడూ కలియబెడుతూ ఉండాలి. దాన్ని కప్పులోకి వడకట్టుకొని కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకొంటే సరి.

పెరుగుతో.. అవిసెలను పెరుగుతో కలిపి తీసుకోండి. పెరుగులో ఉండేే ప్రొటీన్‌ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. అవిసె గింజలతో పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువూ అదుపులో ఉంటుంది.

నీళ్లలో నానబెట్టి.. కప్పు నీళ్లలో చెంచా అవిసె గింజలను రాత్రంతా నానబెట్టుకుని పరగడుపున తాగాలి. ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు తాగితే ప్రయోజనం ఉంటుంది.

స్మూతీలా.. కప్పు నీళ్లల్లో రెండు టేబుల్‌ స్పూన్‌ అవిసెలు, కొన్ని పుదీనా ఆకులు, కప్పుడు స్ట్రాబెర్రీ, అరటిపండు ముక్కలు కలిపి స్మూతీలా చేసుకుని తీసుకుంటే శరీరానికి పోషకాలు అందటమే కాదు బరువూ తగ్గుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని