బెడ్షీట్లను తరచూ శుభ్రం చేస్తున్నారా..?
మీరు బెడ్షీట్లను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేస్తున్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకంటే చాలావరకు శ్వాస సంబంధిత వ్యాధులకు శుభ్రంగా లేని బెడ్షీట్లే కారణమని
మీరు బెడ్షీట్లను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేస్తున్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకంటే చాలావరకు శ్వాస సంబంధిత వ్యాధులకు శుభ్రంగా లేని బెడ్షీట్లే కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటిపై దుమ్ము-ధూళి పేరుకుపోవడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌లకూ అవి ఆలవాలమవుతాయి. కాబట్టి బెడ్షీట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మరి, ఇంతకీ బెడ్షీట్లను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? ఒకవేళ మాసిన బెడ్షీట్లనే వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు తలెత్తుతాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
చాలా రోజుల పాటు శుభ్రం చేయని బెడ్షీట్లపై బ్యాక్టీరియా, వైరస్లు, దుమ్ము-ధూళి వంటివి పేరుకుపోతాయి. వీటిని వాడడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, పలు చర్మ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా కరోనా కలకలం సృష్టిస్తోన్న ఈ సమయంలో బెడ్షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఎవరికి వారే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటి నుంచి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకోకముందే మంచంపై కూర్చోవడం, అవే అపరిశుభ్రమైన చేతులతో బెడ్షీట్లను తాకడం వల్ల అక్కడ వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి బయటి నుంచి వచ్చాక వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇంట్లోని బెడ్షీట్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అదెలాగంటే..
ఎప్పుడెప్పుడు?
* సాధారణంగా బెడ్షీట్లను వారానికి ఒక్కసారైనా ఉతకాలి. అయితే ప్రస్తుతం అందరూ ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుండడం వల్ల బెడ్ పైనే తినడం, ఎక్కువ సమయం పడుకోవడం.. లాంటివి చేస్తున్నారు. ఫలితంగా అవి త్వరగా మాసిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారానికి రెండుసార్లైనా బెడ్షీట్లను మార్చడం ఉత్తమం.
* ఇక కొన్ని రకాల చర్మ వ్యాధులు లేదా ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు క్రమం తప్పకుండా బెడ్షీట్లను మారుస్తూ ఉండాలి. అలాగే అందరూ వాడుకునేవి కాకుండా ప్రత్యేకంగా వారి కోసం కొన్ని బెడ్షీట్లను కేటాయించడం మంచిది.
* కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా బెడ్ పైకి తీసుకురావడం, వారి పక్కనే పడుకోబెట్టుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా వాటి వెంట్రుకలు లేదా చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు బెడ్‌షీట్‌కి అంటుకునే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు బెడ్ పైకి తీసుకురాకుండా చూసుకోవాలి. ఒకవేళ తీసుకొచ్చినా రెండురోజులకోసారి బెడ్‌షీట్ మార్చాలన్న విషయం మర్చిపోవద్దు.
ఎలా ఉతకాలి..?
* బెడ్షీట్లను శుభ్రం చేసే క్రమంలో వేడినీళ్లను ఉపయోగిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశించడంతో పాటు వాటికి అంటుకున్న మురికి త్వరగా వదిలిపోతుంది. అయితే ఈ సమయంలో బెడ్‌షీట్ నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ నాణ్యత గల బెడ్షీట్లను మరీ ఎక్కువగా వేడి చేసిన నీళ్లలో నానబెట్టడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంటుంది.. కాబట్టి అలాంటి వాటిని గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ పౌడర్ వేసి కాసేపు నానబెట్టి ఆపై ఉతకాలి.
* త్వరగా మురికి పోవాలని, సువాసన రావాలని కొంతమంది ఎంతపడితే అంత డిటర్జెంట్ పౌడర్ని వాడుతుంటారు. అయితే ఈ పౌడర్లను కూడా తగిన మోతాదులోనే ఉపయోగించాలి. ఎక్కువ మొత్తంలో పౌడర్లను ఉపయోగిస్తే అందులో ఉండే రసాయనాలు బెడ్‌షీట్ నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే అధిక డిటర్జెంట్ పౌడర్ వాడడం వల్ల ఉతికే క్రమంలో అది పూర్తిగా వదిలిపోకుండా బెడ్‌షీట్‌పై పేరుకుపోతుంది.. ఫలితంగా కూడా చర్మ సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
* ఇక ఉతికిన బెడ్షీట్లను ఎండలో ఆరేయాలి. అవి సరిగ్గా ఆరకపోతే వాటి తడిదనం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఇవి కూడా చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.
* ఇలా బెడ్షీట్లను ఉతికిన తర్వాత వాటిని ఐరన్ చేస్తే అందులో ఇంకా ఏమైనా క్రిములుంటే నాశనమవుతాయి.
ఈ జాగ్రత్తలు కూడా!
* కొంతమంది బద్ధకంతో మేకప్ తొలగించుకోకుండానే పడుకుంటారు. తద్వారా మేకప్ అవశేషాలు బెడ్‌షీట్, దిండు కవర్‌కు అంటుకుంటాయి. ఇవి కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మేకప్ తొలగించుకున్నాకే పడుకోవడం వల్ల బెడ్‌షీట్ శుభ్రంగా ఉంటుంది.. మీకూ ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.
* బయటి నుంచి వచ్చాక దుమ్ము-ధూళి చేరిన కాళ్లతోనే బెడ్ పైకి ఎక్కడం మానుకోండి.. శుభ్రంగా స్నానం చేయడం లేదంటే చేతులు-కాళ్లు కడుక్కొని డ్రస్ మార్చుకున్న తర్వాతే బెడ్‌పై కూర్చోవడం ఉత్తమం.
* కొందరికి బెడ్ పైనే ఆహారం, స్నాక్స్.. వంటివి తినే అలవాటుంటుంది. తద్వారా ఆహార అవశేషాలు బెడ్‌షీట్‌పై పడి అపరిశుభ్రంగా మారతాయి. కాబట్టి బెడ్‌పై కూర్చొని తిన్నప్పటికీ బెడ్‌షీట్‌పై ఆహార పదార్థాలు పడకుండా చూసుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో బెడ్షీట్లను శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!