వేసవిలో సోంపు టీ..

ఎండల వేడికి డీహైడ్రేషన్‌ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. తల్లిపాల ఉత్పత్తికీ సమస్య ఎదురవుతుంటుంది. ఇలా వేసవిలో గురయ్యే పలురకాల అనారోగ్యాల నుంచి మహిళలను దూరంగా ఉంచే టీ, పానీయాల గురించి నిపుణులు సూచిస్తున్నారిలా!

Published : 18 Mar 2023 00:05 IST

ఎండల వేడికి డీహైడ్రేషన్‌ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. తల్లిపాల ఉత్పత్తికీ సమస్య ఎదురవుతుంటుంది. ఇలా వేసవిలో గురయ్యే పలురకాల అనారోగ్యాల నుంచి మహిళలను దూరంగా ఉంచే టీ, పానీయాల గురించి నిపుణులు సూచిస్తున్నారిలా!

జల్‌జీరాతో..

పుదీనా, జీలకర్ర, బెల్లం, బ్లాక్‌, జింజర్‌ సాల్ట్‌, నిమ్మరసం వంటివాటిని కలిపి చేసే జల్‌జీరా పానీయం వేసవికి సరైన ఔషధం. దాహాన్ని అరికట్టడమే కాకుండా అజీర్తి, గ్యాస్‌ వంటి సమస్యలను కూడా ఇది దూరంగా ఉంచుతుంది. నిమ్మకాయంత చింతపండు రసంలో ముక్కలుగా చేసిన మూడు చెంచాల పుదీనా ఆకులు, అరచెంచా వేయించిన జీలకర్ర పొడి, నాలుగు చెంచాల బెల్లం పొడి, సరిపడినంత బ్లాక్‌సాల్ట్‌, చిటికెడు జింజర్‌ సాల్ట్‌, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు గరంమసాలా పొడి వేయాలి. ఈ మిశ్రమానికి అరలీటరు నీటిని కలిపి రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచాలి. మధ్యాహ్నం సమయంలో గ్లాసులో ఈ చల్లని జల్‌జీరా రసాన్ని నింపి పైన కొంచెం బూందీ చల్లి తీసుకుంటే చాలు. శరీరానికి తక్షణశక్తి లభిస్తుంది. ఈ పానీయంతో డీహైడ్రేషన్‌ సమస్యకు చెక్‌ చెప్పొచ్చు.


సోంపు టీ..

చెంచా సోంపు గింజల పొడి, చిన్నముక్కలుగా లేదా కచ్చాపచ్చాగా చేసిన పావు చెంచా అల్లం ముక్కలను కప్పున్నర నీటిలో వేసి అయిదు నిమిషాలపాటు మరిగించాలి. దించిన తర్వాత అరచెంచా తేనె, మూడునాలుగు పుదీనా ఆకులు వేసి కలిపి గోరువెచ్చగా తీసుకుంటే చాలు. ఈ సోంపుగింజల టీ శరీరంలోని మలినాలను బయటకు పంపి, డీహైడ్రేషన్‌కు గురికాకుండా పరిరక్షిస్తుంది. రోజంతా పనితో అలసటగా ఉన్నప్పుడు ఇది ఔషధంలా పనిచేసి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తల్లిపాల ఉత్పత్తికి దోహదపడుతుంది. కంటినిండా నిద్రపట్టేలా చేస్తుంది. జీవక్రియలను సమతుల్యం చేయడంతోపాటు వేసవిలో ఎదురయ్యే అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్