Irregular Periods : నా అధిక బరువుకు అదే కారణమా?

హాయ్‌ మేడం. నేను గత కొన్ని రోజుల నుంచి నీటి బుడగలతో బాధపడుతున్నా. ఫలితంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, చుండ్రు, అవాంఛిత రోమాలు.. మొదలైన సమస్యల్ని ఎదుర్కొంటున్నా. నేనొక సాధారణ ఉద్యోగిని. 8 గంటల పాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఎన్ని.....

Published : 26 Mar 2022 16:22 IST

హాయ్‌ మేడం. నేను గత కొన్ని రోజుల నుంచి నీటి బుడగలతో బాధపడుతున్నా. ఫలితంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, చుండ్రు, అవాంఛిత రోమాలు.. మొదలైన సమస్యల్ని ఎదుర్కొంటున్నా. నేనొక సాధారణ ఉద్యోగిని. 8 గంటల పాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఎన్ని కసరత్తులు చేసినా నా బరువు అదుపు కావట్లేదు. అలాగే నెలసరి కూడా సరిగ్గా రావట్లేదు. నాకు త్వరలోనే పెళ్లి. ఈ సమస్యల వల్ల పెళ్లయ్యాక ఇబ్బందులొస్తాయేమోనని భయంగా ఉంది. ఏం చేయను?- ఓ సోదరి

జ: మీరు చెబుతున్న లక్షణాలన్నీ పీసీఓఎస్‌ ఉన్న స్త్రీలలో సర్వసాధారణం. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం సహజం. పీసీఓఎస్‌కి వైద్య చికిత్సలతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గాలి అన్న అవగాహన మీకు ఉంది కాబట్టి.. చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ.. మీకున్న సమయంలోనే మీరు చేయగలిన వ్యాయామాలు చేసి బరువు తగ్గడం మాత్రం తప్పనిసరి. పీసీఓఎస్‌ అదుపులోకి రాకపోతే పెళ్లి తర్వాత కూడా గర్భం నిలవడం కష్టమవుతుంది. అందుకని మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స మొదలుపెట్టండి. అలాగే న్యూట్రిషనిస్ట్‌, ఫిజియో థెరపిస్ట్‌, డెర్మటాలజిస్ట్‌, ఎండోక్రైనాలజిస్ట్‌.. వీరందరి సలహాలు కూడా అవసరమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్