Published : 05/02/2022 18:50 IST

జుట్టు నల్లగా మారాలంటే ఏం చేయాలి?

హాయ్ మేడం.. నాకు ఎక్కువగా తెల్లజుట్టు సమస్య ఉంది. నా వయసు 34సం||. నాకు 20 ఏళ్ల వయసు నుంచే ఈ సమస్య ఉంది. దాని నుంచి బయటపడేందుకు కొన్నాళ్లు హెన్నా పెట్టుకున్నా. కానీ ఈ మధ్యే కురులకు డై వేయడం ప్రారంభించా. అయితే అలా కేశాలకు రంగు వేయడం మంచిది కాదని విన్నాను. అందుకే తిరిగి హెన్నా పెట్టుకోవడం ప్రారంభించా. కానీ జుట్టంతా ఎర్రగా మారిపోతోంది. నా జుట్టు తిరిగి నల్లగా కనిపించాలంటే ఏం చేయాలి? ఎలాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటించాలి?? - ఓ సోదరి
జ. తెల్లజుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అది వంశపారంపర్యం కూడా కావచ్చు. అయితే ఈ సమస్య మరింత ఎక్కువ కాకుండా ఉంటూనే తగ్గుముఖం పట్టేందుకు ఈ కింద చెప్పిన హెయిర్ ప్యాక్, నూనె ప్రయత్నించి చూడండి.

హెయిర్ ప్యాక్:

కావాల్సినవి:

కరివేపాకు పేస్ట్- 1 బౌల్

గుంటగలగరాకు పేస్ట్- 1 బౌల్

హెన్నా (గోరింటాకు పొడి) - 1/2 బౌల్

ఈ మూడింటినీ టీ డికాషన్‌లో మిక్స్ చేసి కురులకు ప్యాక్‌లా అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకొని మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి.

ఇలా వారానికి రెండుసార్ల చొప్పున నాలుగు నెలలపాటు క్రమం తప్పకుండా పెట్టుకుంటే ఫలితం కనిపిస్తుంది.

హెయిర్ ఆయిల్:

కావాల్సినవి:

కొబ్బరినూనె- 250 ఎంఎల్

కరివేపాకు (పచ్చివి)- 10గ్రా.

ఎండిన ఉసిరి ముక్కలు- 20గ్రా.

ఒక గిన్నెలో కొబ్బరినూనె తీసుకొని అందులో కరివేపాకు, ఎండిన ఉసిరి ముక్కలు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని కురులకు కొద్దికొద్దిగా అప్త్లె చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్ల చొప్పున మూడుసార్లు చేయడం వల్ల ఫలితం కనిపించే అవకాశాలుంటాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని