వక్షోజాల సైజు పెరగాలంటే..

హలో డాక్టర్. నా వయసు 22. బరువు 37 కిలోలు. ఎత్తు 5'3''. నేను చాలా సన్నగా ఉంటాను. నా వక్షోజాల పరిమాణం కూడా చిన్నగా ఉంది. పీసీఓఎస్ ఉంది. బరువు, శరీరాకృతి గురించే నా సమస్య..! నేను బరువు పెరగాలంటే ఏంచేయాలి? అలాగే నా వక్షోజాల పరిమాణం....

Updated : 14 Feb 2023 20:43 IST

హలో డాక్టర్. నా వయసు 22. బరువు 37 కిలోలు. ఎత్తు 5'3''. నేను చాలా సన్నగా ఉంటాను. నా వక్షోజాల పరిమాణం కూడా చిన్నగా ఉంది. పీసీఓఎస్ ఉంది. బరువు, శరీరాకృతి గురించే నా సమస్య..! నేను బరువు పెరగాలంటే ఏంచేయాలి? అలాగే నా వక్షోజాల పరిమాణం పెరిగేందుకు తగిన సలహాలు, సూచనలు తెలియజేయగలరు. - ఓ సోదరి

జ: మీ ఎత్తుకి సరిపోయినంత బరువు ఉండాలంటే 50 నుంచి 55 కిలోల వరకు ఉండాలి. అయితే మీరు ముఖ్యంగా బరువు పెరగాలని, అందులోనూ వక్షోజాల పరిమాణం పెరగాలని కోరుకుంటున్నారు. బరువు అనేది కొంతవరకు వంశపారంపర్యంగానూ, మరికొంతవరకు ఆహారపు అలవాట్లతోనూ వస్తుంది. ఆహారంలో భాగంగా ఎక్కువ క్యాలరీలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

వక్షోజాల విషయానికొస్తే వీటిలో ముఖ్యంగా రెండు రకాల టిష్యూలుంటాయి. ఒకటి పాలగ్రంథి, రెండోది కొవ్వు పదార్థం. పాల గ్రంథులు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే పెరుగుతాయి. ఉదాహరణకు.. గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు. ఈ గ్రంథిని మనం కృత్రిమంగా పెంచడం వీలు కాదు. మీ శరీరం మొత్తం బరువు పెరిగితే ఆటోమేటిక్‌గా వక్షోజాల పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఉన్న బరువుతో అది సాధ్యం కాదు.. కాబట్టి మమ్మరీ ఆగ్మెంటేషన్ అనే ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా వక్షోజాల పరిమాణం పెంచవచ్చు. కానీ మీరు ప్రస్తుతం ఉన్న 37 కిలోల బరువుతో ఇటువంటివి చేయించుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అందుకని సహజ పద్ధతుల ద్వారానే బరువు పెరగడానికి ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్