ఇంట్లోనే డాగ్ వాష్ తయారుచేద్దాం..!
ఈ వేసవిలో మనలాగే మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల్నీ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం. ఇందుకు వాటికి స్నానం చేయించే క్రమంలో డాగ్....
ఈ వేసవిలో మనలాగే మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల్నీ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం. ఇందుకు వాటికి స్నానం చేయించే క్రమంలో డాగ్ షాంపూలు, పెట్ వాష్‌లు ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని మార్కెట్లో కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. మరి, అదెలాగో? వాటిని ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..
వెనిగర్‌తో..
కావాల్సినవి
* నీళ్లు - 4 కప్పులు
* వెనిగర్ లేదా యాపిల్ సిడార్ వెనిగర్ - కప్పు
* బేబీ షాంపూ - కప్పు
తయారీ
ఈ మూడింటినీ కలిపి ఒక స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెట్ డాగ్ వెంట్రుకలపై స్ప్రే చేసి ఐదు నిమిషాల తర్వాత రుద్ది శుభ్రం చేస్తే సరిపోతుంది. మీ పెట్ చర్మం బాగా సున్నితమైనదైతే ఈ సోప్ వాష్ చక్కగా పనిచేస్తుంది.
బేకింగ్సోడాతో..
కావాల్సినవి
* బేకింగ్ సోడా - కప్పు
* కార్న్ స్టార్చ్ - కప్పు
* నిమ్మ లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ - కొన్ని చుక్కలు
తయారీ
ఈ మూడింటినీ కలిపి ఒక స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. పెట్ డాగ్‌కు స్నానం చేయించే క్రమంలో ఈ మిశ్రమాన్ని కొద్దిగా స్ప్రే చేసి చేత్తో లేదంటే బ్రష్‌తో మృదువుగా కుక్క చర్మంపై రుద్దాలి. ఆపై చల్లటి నీటితో కుక్కకు స్నానం చేయించాలి. అయితే ఈ క్రమంలో ఎక్కువ మిశ్రమాన్ని పెట్‌పై స్ప్రే చేయకూడదు. ఎందుకంటే బేకింగ్ సోడా ఎక్కువగా చల్లితే కుక్క చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఓట్మీల్ డాగ్ షాంపూ
కావాల్సినవి
* ఓట్మీల్ - కప్పు
* బేకింగ్ సోడా - కప్పు
* వేడి నీళ్లు - నాలుగు కప్పులు
* డిష్‌వాషింగ్ లిక్విడ్ - టీస్పూన్
తయారీ
ముందుగా ఓట్‌మీల్‌ను పొడిగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో బేకింగ్ సోడా వేసి రెండింటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్లు పోసి, డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. వాడే ముందు ఒకసారి షేక్ చేసుకుంటే సరిపోతుంది. సువాసన కోసం ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల నిమ్మ లేదా లావెండర్ ఎసెన్షియల్ నూనెను కూడా కలుపుకోవచ్చు.
కలబందతో..
కావాల్సినవి
* నీళ్లు - 4 కప్పులు
* బేబీ షాంపూ - కప్పు
* వెనిగర్ లేదా యాపిల్ సిడార్ వెనిగర్ - కప్పు
* గ్లిజరిన్ - 1/3 కప్పు
* కలబంద గుజ్జు - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ
పదార్థాలన్నింటినీ కలిసేంత వరకు బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. వాడే ముందు షేక్ చేస్తే సరిపోతుంది. పొడిచర్మం ఉన్న పెట్ డాగ్స్‌కి ఈ డాగ్ వాష్ చక్కగా పనిచేస్తుంది.
ఈ జాగ్రత్తలు పాటించండి..!
డాగ్ వాష్‌ను తయారుచేయడమే కాదు.. దాన్ని ఉపయోగించి కుక్కకు స్నానం చేయించే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
* ముందుగా కుక్క వెంట్రుకలను, చర్మాన్ని తడిపి డాగ్ వాష్‌ను స్ప్రే చేయాలి. ఆపై మీ చేయి లేదా బ్రష్ సహాయంతో మృదువుగా రుద్దాలి. ఇప్పుడు చల్లటి నీటితో కుక్కకు స్నానం చేయించాలి. ఆపై తడి గుడ్డతో ముఖం తుడవాలి.
* స్నానం చేయించే క్రమంలో కాలి గోళ్లు, చెవుల వెనుక భాగాలు, తోక.. మొదలైన ప్రదేశాలను కూడా శుభ్రం చేయాలి.
* స్నానం చేయించిన తర్వాత పొడి టవల్‌తో వాటి చర్మాన్ని పొడిగా తుడవాలి. ఈ క్రమంలో హెయిర్ డ్రయర్ వంటివి వాడకూడదు. ఎందుకంటే వీటి వల్ల కుక్క చర్మం పొడిబారే ప్రమాదం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!