Work and Life: అడ్డంకులు తొలగించేయండి

మారిన పరిస్థితుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తోన్న మహిళల సంఖ్య ఎక్కువే. అయితే, ఎంత నిబద్ధతతో చేస్తోన్నా... ఆయా రంగాల్లో ఉన్నతస్థానాలను చేరుకోవడంలో మనకి ఎన్నో అడ్డంకులు.

Published : 16 Apr 2023 00:51 IST

మారిన పరిస్థితుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తోన్న మహిళల సంఖ్య ఎక్కువే. అయితే, ఎంత నిబద్ధతతో చేస్తోన్నా... ఆయా రంగాల్లో ఉన్నతస్థానాలను చేరుకోవడంలో మనకి ఎన్నో అడ్డంకులు. వాటిని అధిగమించాలంటే... ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటారు నిపుణులు...

ఈ మూడూ ముఖ్యం...

చేసే పని ఏదైనా స్పష్టత అవసరం. ఆలోచన వచ్చిందే తడవు అని పని మొదలుపెట్టేయొద్దు. అలానే నిర్ణయం తీసుకోవడంలో తడబాటూ తప్పే. ఆయా రంగాలపై కాస్తంత అవగాహన తెచ్చుకున్నాకే ముందడుగు వేయండి. ముఖ్యంగా పరిశోధన, అంచనా, ప్రణాళిక అనే మూడు సూత్రాల ఆధారంగా మీ దారిని ఏర్పాటు చేసుకోగలిగితే వెనుతిరిగి చూడక్కర్లేదు.

నిలబడితేనే...

ఉన్నతంగా ఎదగాలంటే ముందు అవకాశాల్ని సృష్టించుకోవాలి. వాటిని అందిపుచ్చుకుని.. ఎంత కష్టమైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలగాలి. పోటీలో ఎందరు ఉన్నా... విజేతలు కొందరే ఉంటారు. చివరి వరకూ స్థిరంగా నిలబడితేనే మీరనుకున్నట్లు చేయగలరు.

అవన్నీ పాఠాలే...

ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆలోచనకంటే ముందు లాభాలూ, పదోన్నతులు వంటివాటి కోసం ఆలోచించే అలవాటు మీకుందా? అయితే వాటికి దూరంగా ఉండండి. ఇవి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి. మీరు వందశాతం ప్రయత్నించండి. ఒకటి రెండు సార్లు విఫలమైతే దాన్నే పాఠంగా నేర్చుకుని గెలుపునకు దగ్గర అవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్