Urinary tract disease: ప్రయాణాల్లో ఆ ఇబ్బందికి..
‘బస్సులో ప్రయాణం నా వల్ల కాదు’ చాలామంది మహిళల నుంచి వినపడే మాటే ఇది. సాధారణంగా మధుమేహం ఉన్నవారికే మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటాం. కానీ.. ప్రసవం తర్వాత, ఒక్కోసారి మెనోపాజ్ దశలో ఉన్నవారికీ ఈ సమస్య ఎదురవుతుంది.
‘బస్సులో ప్రయాణం నా వల్ల కాదు’ చాలామంది మహిళల నుంచి వినపడే మాటే ఇది. సాధారణంగా మధుమేహం ఉన్నవారికే మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది అనుకుంటాం. కానీ.. ప్రసవం తర్వాత, ఒక్కోసారి మెనోపాజ్ దశలో ఉన్నవారికీ ఈ సమస్య ఎదురవుతుంది. ఇంట్లో, ఆఫీసులో పర్లేదు. ప్రయాణాల్లో ఇబ్బంది అవుతోందా.. ఈ సూచనలు అనుసరించమంటు న్నారు నిపుణులు.
* ఉదయాన్నే పనిలోకి దిగాలంటే.. ఓ కప్పు కాఫీ లోనికి వెళ్లాల్సిందేనా? ఇందులోని కెఫిన్ నరాలపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా తీసుకుంటే ఆందోళనకీ కారణమవ్వొచ్చు. దీంతో తెలియకుండానే ఎక్కువగా నీరు తీసుకుంటుంటాం కాబట్టి మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయాణ సమయంలో కాఫీకి వీలైనంత దూరంగా ఉండండి. తక్కువగా నీరు తీసుకుంటే పెద్దగా సమస్య ఉండదు.
* నూనె, కారంతో కూడిన ఆహార పదార్థాలు వీలైనంత తగ్గించండి. నీటిపైకి ధ్యాస మళ్లకుండా ఉంటుంది. బదులుగా పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీరూ అందుతుంది. అదనంగా ఆరోగ్యం.
* మధుమేహం లాంటివి ఉన్నాయేమో చెక్ చేయించుకోండి. ఒకవేళ ఉంటే సంబంధించిన మందులను తప్పక వెంట తీసుకెళ్లండి. కొన్నిసార్లు జననాంగాలను పట్టించుకోకపోవడం, ఎక్కువగా పబ్లిక్ టాయ్‌లెట్లను ఉపయోగించే వారిలోనూ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అతి మూత్రానికి కారణమవుతాయి. అందువల్ల శుభ్రతపై తప్పక దృష్టిపెట్టాలి.
* ప్రయాణం చేసే ముందు కొన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లు చేయండి. అక్కడి కండరాలు బలోపేతమై సమస్యని కాస్త దూరం చేస్తాయి. రోజూ వీటికి కొద్ది సమయం కేటాయించగలిగితే శాశ్వత పరిష్కారమూ సాధ్యమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.