Rejuvenate: ఆశలు నెరవేర్చుకోండి

మనకేవైనా బాధలు, వేదనలు ఎదురైతే.. ఫలానా వాళ్లు కారకులంటూ ఎవరో ఒకరిని తప్పుపడుతుంటాం. నిజానికి మన మంచిచెడులకు మనమే కారణం.

Published : 11 Apr 2023 00:48 IST

మనకేవైనా బాధలు, వేదనలు ఎదురైతే.. ఫలానా వాళ్లు కారకులంటూ ఎవరో ఒకరిని తప్పుపడుతుంటాం. నిజానికి మన మంచిచెడులకు మనమే కారణం. కానీ మనలో మాటిమాటికీ అసంతృప్తి తలెత్తుతోంది.. ఏదో తెలియని ఆందోళన వేధిస్తోందనిపిస్తోందంటే.. నిర్లక్ష్యం చేయొద్దు. అది డిప్రెషన్‌కు దారితీయొచ్చు. అందాకా తెచ్చుకోకుండా మనసును ఊరడించేందుకు ఇలాంటి సూత్రాలు పాటించమంటున్నారు సైకాలజిస్టులు.

* వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు చూస్తుంటే సమయం ఇట్టే గడిచిపోతుంది కదూ! కానీ అదేమీ ఆరోగ్యకరమైన వ్యాపకం కాదు. దానివల్ల కాలం వృథా అవడమే కాదు.. చూపు కూడా దెబ్బతింటుంది. కనుక మీ బాగు కోసం మీరే సోషల్‌ మీడియాకు అప్పుడప్పుడైనా దూరంగా ఉండండి. మీరు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం.

* తీరని కోరికను చాన్నాళ్లుగా వాయిదా వేస్తున్నారా? ప్రతి దానికీ ఏవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఆ మాత్రానికే అనుకున్నది మానేసినా, నీరసించి పక్కన పెట్టినా.. జీవనం నిరాశగా, నిస్సత్తువగా మారుతుంది. అవరోధాలను అధిగమిస్తూ ఆశలు నెరవేర్చుకోవాలి.

* అమృత్‌సర్‌, కొడైకెనాల్‌ లాంటి ప్రదేశాలు చూడాలని కలలు కంటున్నారా? సునాయాసంగా విదేశాలు చుట్టొస్తున్న ఈ రోజుల్లో అదేమంత జటిలం కాదుగా! వెంటనే ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి ట్రిప్పులు ఉపశమనాన్నిస్తాయి. గొప్ప ఉత్తేజం కలుగుతుంది.

* పెద్దవాళ్లమైపోతున్నాం.. హుందాగా ఉండాలి.. అంటూ మీకు మీరే నియమాలూ ఆంక్షలూ పెట్టుకోవద్దు. పరుగు పెట్టడం, కళ్లకు గంతలు, తొక్కుడుబిళ్ల లాంటి ఆటలు నిరభ్యంతరంగా ఆడండి. అలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటే దిగుళ్లకు ఆస్కారమే ఉండదు. సగం వయసు తగ్గిపోతుంది కూడా.

* మీకు చాలా ఆత్మీయంగా అనిపించే కుటుంబాలతో కలిసి ఒకరోజు గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకోండి. తలా ఒక వంటకం తెచ్చారంటే ఎవరికీ భారం కాదు, అందరూ కలిసి కబుర్లు చెప్పుకొంటూ విందు ఆరగించడం బాగుంటుంది. విరి జల్లులో తడిచిన అనుభూతి సొంతమవుతుంది. ఇక బాధలకు తావెక్కడిది?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్