ఆ ఆనవాళ్లు తొలగించండిలా..
కొత్త దుస్తులు ఆనందమే కానీ.. వాటికి అంటించే స్టిక్కర్లతోనే సమస్య! చాలాసార్లు కొంతభాగం వస్త్రాలకే అతుక్కొని ఉంటాయి. ఎన్నో ఉతుకులు పడితేగానీ పేపర్, జిగురు మొత్తం పోవు. ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.
కొత్త దుస్తులు ఆనందమే కానీ.. వాటికి అంటించే స్టిక్కర్లతోనే సమస్య! చాలాసార్లు కొంతభాగం వస్త్రాలకే అతుక్కొని ఉంటాయి. ఎన్నో ఉతుకులు పడితేగానీ పేపర్, జిగురు మొత్తం పోవు. ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.
* వస్త్రాన్ని నేలపై తిరగేయాలి. స్టిక్కర్ ఉన్న ప్రాంతంలో నెయిల్ పాలిష్ రిమూవర్‌తో అద్దాలి. ఆపై నెమ్మదిగా రుద్దేస్తే జిగురు, దానికి అతికున్న కాగితం ఊడిపోతాయి. చల్లటి నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి, ఆరేస్తే సరి.
* స్టిక్కర్‌ని పీకేయకుండా ఆ వస్త్రాన్ని గంటపాటు ఫ్రీజర్‌లో గంటసేపు ఉంచితే స్టిక్కర్‌ను తేలికగా తీసేయొచ్చు. గోరువెచ్చని నీళ్లలో కాస్త లిక్విడ్ డిష్‌వాష్ వేసిన మిశ్రమంలో కొద్దిసేపు ఆ డ్రెస్ మునిగేలా ఉంచితే పూర్తిగా వచ్చేస్తుంది. తెల్లటి ప్యాచ్‌లా మిగిలిపోతుందన్న భయమూ ఉండదు.
* వైట్ వెనిగర్‌ని కాస్త వేడి చేయండి. దానిలో వస్త్రాన్ని ముంచి స్టిక్కర్ ఉన్న ప్రాంతంలో అద్ది, స్పూను లేదా చాకుతో గీకేయాలి. తర్వాత డిటర్జెంట్‌తో ఉతికి, ఆరేస్తే సరి. ఆనవాళ్లు కనిపించవు.
* వస్త్రాన్ని నేల లేదా బల్లమీద స్టిక్కర్ కిందకి వెళ్లేలా బోర్లా ఉంచాలి. దానిపై చిన్న వస్త్రాన్ని కప్పి బాగా వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను కొన్ని సెకన్లు ఉంచి, తీయాలి. ఇప్పుడు స్టిక్కర్ తొలగిస్తే పూర్తిగా వచ్చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.