తొక్కిసలాట జరిగితే.. ఇలా తప్పించుకుందాం!

అనుకోకుండా జనసమూహంలో ఇరుక్కుపోయాం. అది హత్రాస్‌లోని సత్సంగ్‌లో కావొచ్చు లేదా థియేటర్, కమ్యునిటీ హాలు, స్టేడియంలో కూడా కావొచ్చు. అలాంటప్పుడు తొక్కిసలాట మొదలైతే ముందుగా బాధితులయ్యేది బలహీనంగా ఉండే మహిళలూ, పిల్లలే.

Updated : 05 Jul 2024 13:31 IST

అనుకోకుండా జనసమూహంలో ఇరుక్కుపోయాం. అది హత్రాస్‌లోని సత్సంగ్‌లో కావొచ్చు లేదా థియేటర్, కమ్యునిటీ హాలు, స్టేడియంలో కూడా కావొచ్చు. అలాంటప్పుడు తొక్కిసలాట మొదలైతే ముందుగా బాధితులయ్యేది బలహీనంగా ఉండే మహిళలూ, పిల్లలే. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త తెలివిగా వ్యవహరిస్తే తొక్కిసలాట నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. ప్రాణాలని కాపాడుకోవచ్చు. ఆయా సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో తెలియచెప్పేందుకు గుడ్‌మార్నింగ్‌ అమెరికా అనే టీవీ ఛానెల్‌ చేసిన  వీడియోని తెలంగాణ అడిషనల్‌ డీజీపీ స్వాతిలక్రా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు...  

ద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు... సాధారణంగా వెనక నుంచి ఒక్కరు కొద్దిపాటి బలంతో ముందు వాళ్లని నెట్టినా అక్కడున్న వాళ్లంతా ఒకేసారి ముందుకు కదులుతారు. దాంతో సమూహంలో ఉన్నవారి ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి, ఊపిరాడదు. ఇంకా గందరగోళానికి గురై మరింతగా ప్రమాదంలో చిక్కుకుంటాం. బదులుగా పిడికిలి బిగించి రెండు చేతులని పైకి మడిచి ఛాతీకిరువైపులా రక్షణగా పెట్టుకోవాలి. బాక్సర్లు ఎలా చేతులు మడుస్తారో అలా ఉంచాలి. అలాగే కాళ్ల మధ్య కాస్త ఎడం ఉండాలి. ఇలా చేస్తే వెనక నుంచి నెట్టినా పడిపోకుండా గ్రిప్‌ దొరుకుతుంది. ఊపిరాడుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి ఉండదు. 

  • సమూహం అంతా ఒకవైపు వెళుతుంటే దానికి ఎదురెళ్లడం కూడా ప్రమాదమే. దానివల్ల మనమీద ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. సమూహంతోపాటు ముందుకు వెళుతూ రద్దీ పలుచగా ఉండే వైపు మళ్లాలి. అటువంటి సమయంలో ఎవరు ఏం చెప్పాలనుకున్నా గట్టిగా అరిచి చెబుతుంటారు. అది మంచి పద్ధతి కాదు. అలా చేస్తే గందరగోళం పెరగడంతోపాటు శరీరంలో ఉన్న శక్తంతా వృథాగా ఖర్చు అయిపోతుంది. బదులుగా సైగలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే బలంగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి. 

  • తోపులాట ఎక్కువై కింద పడితే వెల్లకిలా కాకుండా ఒకపక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. అంటే వీపు నేలకు ఆనించకూడదు. పొట్టమీద మరొకరు పడకుండా, ఒకపక్కకు ఉండి చేతులని మడిచి తలకు రక్షణగా పెట్టుకోవాలి. తలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. 
  • సాధారణంగా ఒకటే ద్వారం నుంచి బయటకు వెళ్లాలని అందరూ ప్రయత్నిస్తారు. దీనినే చోకింగ్‌ పాయింట్‌ అంటారు. అది చిన్నగా ఉంటే చాలామంది అక్కడే ఇరుక్కుపోయి గాయాలపాలవుతారు. అలా కాకుండా ఒక పక్కగా రావడం, లేదా వేరే దారులున్నాయేమో చూడటం చేయండి.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్