Argument - Discussion: చర్చ.. వాదన మధ్య తేడా నేర్పాలి

నిఖిల్‌ తనపై తల్లి కోప్పడితే కారణాన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతడి తమ్ముడు హరి మాత్రం తల్లితో ప్రతి విషయాన్ని వాదిస్తాడు. చర్చించడం, వాదించడం మధ్య ఉండే తేడా తెలియకపోవడం వల్లే సమస్య.

Published : 06 Apr 2023 00:19 IST

నిఖిల్‌ తనపై తల్లి కోప్పడితే కారణాన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతడి తమ్ముడు హరి మాత్రం తల్లితో ప్రతి విషయాన్ని వాదిస్తాడు. చర్చించడం, వాదించడం మధ్య ఉండే తేడా తెలియకపోవడం వల్లే సమస్య. కాబట్టి వాటిని చిన్నతనం నుంచే చెప్పాలంటున్నారు నిపుణులు.

తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. అలాగే వారేదైనా చెబుతున్నప్పుడు పూర్తిగా వినడానికి ఆసక్తి చూపించాలి. అప్పుడే వారి ఆలోచనలను అర్థం చేసుకోవచ్చు. వారు చెప్పేది వినకుండా పెద్దవాళ్లు చెప్పేది మాత్రమే వినాలి అని అనొద్దు. ఆ తీరు వారికి నచ్చదు. బలవంతంగా లేదా భయపడి అప్పటికి పాటించినా, వారి మనసు లోతుల్లో వ్యతిరేకత మొదలవుతుంది. తమ అభిప్రాయాన్ని చెప్పనివ్వడం లేదనుకొని వారి మనసు బాధపడుతుంది. పెద్దవాళ్లు తమ మాట వినాలంటే అరిచి చెప్పడం, వాదించడమే సరైన దారి అనే భావన పిల్లల్లో ప్రారంభమవుతుంది. క్రమేపీ ఈ అలవాటు పూర్తిగా వాదించే స్వభావాన్ని తెచ్చిపెడుతుంది. చిన్నచిన్న విషయాలకు కూడా అవతలివారిని వాదిస్తేనే గెలవగలమనే అభిప్రాయానికి పిల్లలు చేరుకుంటారు. అందుకే పిల్లలకు మాట్లాడే అవకాశాన్నిస్తేనే వాదన స్వభావం నుంచి వారిని దూరం చేయొచ్చు.

చర్చించి.. అమ్మానాన్నలతోనే కాకుండా తోబుట్టువులతోనూ కొందరు ప్రతిదానికీ వాదిస్తారు. విషయమేదైనా చర్చించుకుంటే పరిష్కారం ఉంటుందనేది పిల్లలకు నేర్పాలి. వాదించే చిన్నారులను ప్రోత్సహించకూడదు. అలాగని వారిని నిరోధించకూడదు. వాదనంతా పూర్తయిన తర్వాత సదరు ఆ అంశాన్ని మాట్లాడి ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది వారికి కోపంతో కాకుండా మృదువుగా చెప్పాలి. వాదించడంవల్ల అవతలివ్యక్తితో అనుబంధం ఎలా దూరమవుతుందో, మరోసారి ఎదుటివారు మాట్లాడటానికి నిరాసక్తత చూపిస్తారో అవగాహన కలిగించాలి. వాదనతో అసలు విషయాలు మరుగున పడిపోయే అవకాశం ఉందనీ చెప్పాలి. ప్రశాంతంగా చర్చించుకుంటే తీరిపోయే సమస్యలను వాదనతో జఠిలం చేసుకోకూడదనేది బాల్యం నుంచి నేర్పిస్తే చాలు. ఎదుటివారితో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు. భవిష్యత్తులో ఎదురైన ఏ సమస్యనైనా చర్చించి పరిష్కరించుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్