Book Reading: పుస్తక పఠనాన్ని నేర్పిద్దామా..

పిల్లలు విసిగించినా, ఏడ్చినా, అల్లరి చేస్తున్నా... వారిని నియంత్రించడానికి ఇప్పటితరం వాడుతున్న అస్త్రం ఫోన్‌. దీని పర్యవసానం చిన్నవయసులోనే కళ్లద్దాలు. ఎదుగుదలకు ఆటంకం.

Published : 15 Apr 2023 00:20 IST

పిల్లలు విసిగించినా, ఏడ్చినా, అల్లరి చేస్తున్నా... వారిని నియంత్రించడానికి ఇప్పటితరం వాడుతున్న అస్త్రం ఫోన్‌. దీని పర్యవసానం చిన్నవయసులోనే కళ్లద్దాలు. ఎదుగుదలకు ఆటంకం. వీటి నుంచి తప్పించాలంటే పుస్తక పఠనం నేర్పాల్సిందే అంటున్నారు నిపుణులు. పుస్తకమిచ్చి చదువు నాన్నా.. అంటే చదువుతారా మన పిడుగులు. దానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చుద్దామా మరి...?

బహుమతిగా.. మార్కెట్లోకి ఏ కొత్త బొమ్మ వచ్చినా కావాలి బుడతలకి. దాని కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. పర్వాలేదనిపిస్తే కొనండి. కానీ ఇచ్చేముందు దానితో పాటు ఒక పుస్తకం కూడా ఇవ్వండి. చదివి ఏం నేర్చుకున్నారో చెబితేనే కోరుకున్నది దొరుకుతుందని చెప్పండి. నచ్చిన వస్తువు కోసమైనా పుస్తకాన్ని చదువుతారు.

పోటీ పెట్టండి... పిల్లలు ఇష్టపడే జానర్‌ పుస్తకాలు తెచ్చి వారి మధ్య పోటీ పెట్టండి. ఎవరు ముందు చదవడం పూర్తిచేస్తే వారికి బహుమతిని ప్రకటించండి. చకచకా పుస్తకాలు తెరిచేస్తారు.

మీరు కూడా... పిల్లలకు పుస్తకాన్నిస్తాం. మనం మాత్రం పక్కనే టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు వాడుతుంటాం. ఇక వారికి చదవాలనే ఆసక్తి ఎలా వస్తుంది? అందుకే పిల్లలతో పాటు మీరూ పుస్తకం పట్టండి. వీలులేకపోతే పైవాటికి దూరంగా పుస్తక పఠనానికి ఏర్పాటు చేయండి.

ఆహ్లాదంగా... చదువుకునే స్థలం ఎంత ఆహ్లాదంగా ఉంటే అంత ఆసక్తి వస్తుంది. చదివే ప్రాంతాన్ని లేత రంగులతో అలంకరించండి. ఆ పనిలో పిల్లల్ని భాగస్వాములను చేయండి. అప్పుడు వారు గీసే బొమ్మలు, ఆకారాల వల్ల వారికున్న ఇష్టాయిష్టాలు సులువుగా కనిపెట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్