Pattu Saree: పట్టు చీర కట్టారా?

ఫంక్షన్లు, పండుగలు వరుసగా ఉన్నాయి. ప్రతి కార్యక్రమానికీ చీర తీసి కట్టేస్తాం. అలా అన్ని చీరలను ప్రతిసారి వాష్‌చేయనవసరం లేదు. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవి ఎక్కువ కాలంమన్నుతాయి అదెలాగో చూద్దామా.

Updated : 31 Mar 2023 04:27 IST

ఫంక్షన్లు, పండుగలు వరుసగా ఉన్నాయి. ప్రతి కార్యక్రమానికీ చీర తీసి కట్టేస్తాం. అలా అన్ని చీరలను ప్రతిసారి వాష్‌చేయనవసరం లేదు. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవి ఎక్కువ కాలంమన్నుతాయి అదెలాగో చూద్దామా.

కొత్త చీరలపై ఏవైనా మరకలు ఉంటే ఆ ప్రాంతం వరకే శుభ్రం చేయాలి. అలా కాకుండా చీర మొత్తాన్ని ప్రతిసారీ శుభ్రం చేస్తే రంగు, నాణ్యత రెండూ దెబ్బతింటాయి. .

లిక్విడ్‌లతో.. మార్కెట్‌లో దుస్తులు శుభ్రం చేసేందుకు రకరకాల లిక్విడ్‌సోప్‌లు దొరుకుతున్నాయి. నూలు వస్త్రాలకి వాటిని నేరుగా వాడొచ్చు. కానీ కొత్తవాటికీ ముందుగా చీర లోపలి భాగాన్ని లిక్విడ్‌ వేసిన నీళ్లలో ముంచి పరీక్షించండి. దాని వల్ల ఏ హాని లేదనిపిస్తేనే మొత్తం చీరకు వాడండి. ఎక్కువ మంది డిటర్జెంట్‌ పౌడర్‌, షాంపూలతో కొత్త చీరలను శుభ్రం చేస్తుంటారు. అలా చేసినప్పుడు గాఢత తక్కువగల ఉత్పత్తులను ఎంచుకోండి.

చేత్తోనే మేలు.. షిఫాన్‌, జార్జెట్‌ చీరలను డెలికేట్‌ వాష్‌లో పెట్టి వాషింగ్‌ మెషిన్‌లో వేయొచ్చు. కానీ నాణ్యత, ఎంబ్రాయిడరీ, రంగులు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త చీరలు వేటినైనా చేత్తో శుభ్రం చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వండి. రకరకాల రంగుల చీరలను ఒకటే బకెట్‌లో ఉంచి ఎప్పుడూ ఉతకకూడదు. ఒకదాని రంగు ఇంకొక దానికి అంటుకునే ప్రమాదం ఉంది. కొంత సమయమే కట్టిన వాటినైతే నీడలో కొంత సేపు ఆరబెట్టి మడత పెట్టి దాచుకోవచ్చు.

డ్రైక్లీనింగ్‌ పట్టుచీరలకు, బాగా మెరిసే వాటికి మాత్రం చేయిస్తే సరిపోతుంది. కొన్ని ఖరీదుగల సిల్క్‌ చీరలను కూడా మొదటి సారి డ్రైవాష్‌కి ఇవ్వండి. ఆ తర్వాత నుంచి ఇంట్లో శుభ్రం చేసుకోవచ్చు. పట్టుచీరలను ఒక్కసారి కట్టిన వెంటనే కాకుండా మూడు, నాలుగు సార్లు కట్టిన తర్వాతే క్లీనింగ్‌కి ఇవ్వాలి. కట్టిన వెంటనే ఆరబెట్టి, ఇంట్లోనే ఇస్త్రీ చేసుకొని దాచుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయి.

రంగులు పోకుండా ఎక్కువగా కాటన్‌ దుస్తులు నీళ్లలో ముంచగానే రంగు వదులుతాయి. అలా కాకుండా ఒక బకెట్‌లో కళ్లుప్పు వేసి కరిగాక దాంట్లో పది నిమిషాలు దుస్తులు ఉంచిన తర్వాత ఉతకాలి. పైన ఎక్కువగా ఉన్న రంగు పోతుంది. తర్వాత నుంచి ఇక అవి రంగు వదలవు. మీకూ నచ్చాయి కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్