పీసీఓఎస్‌ ఉంది.. మళ్లీ పిల్లలు పుడతారా?

హాయ్‌ మేడం. నా వయసు 35. నా భర్త వయసు 40. మాకు 12 ఏళ్ల కూతురుంది. ప్రస్తుతం నేను పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను మరో బిడ్డ కోసం ట్రై చేయచ్చా?- ఓ సోదరి

Updated : 05 Mar 2022 18:41 IST

హాయ్‌ మేడం. నా వయసు 35. నా భర్త వయసు 40. మాకు 12 ఏళ్ల కూతురుంది. ప్రస్తుతం నేను పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను మరో బిడ్డ కోసం ట్రై చేయచ్చా?- ఓ సోదరి

జ: మీకు ఇంకో బిడ్డ కావాలనుకుంటే తప్పనిసరిగా ప్రయత్నించచ్చు.. కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొదటిది - పీసీఓఎస్‌ ఉన్న వారికి అండం విడుదల కాదు కాబట్టి అండం విడుదల కోసం మందులు వాడడం, ఈ క్రమంలో తరచుగా డాక్టర్‌ని సంప్రదించడం చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది - ప్రస్తుతం మీ వయసు 35 ఏళ్లు అంటున్నారు. ఈ వయసులో గర్భం ధరించినప్పుడు ఒక్కోసారి  పుట్టబోయే బిడ్డలకు కొన్ని రకాల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ నేపథ్యంలో గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్