ఆ సూచనలు గమనించారా?

అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయంటూ తిట్టుకుంటూ ఉంటాం. కానీ ముందునుంచీ శరీరం మనకు కొన్ని సూచనలు ఇస్తూనే ఉంటుంది. మనమే వాటికి ఏదో ఒక సమాధానం వెతుక్కుంటూ నిర్లక్ష్యం చేస్తుంటాం.

Published : 01 Jun 2024 04:39 IST

అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయంటూ తిట్టుకుంటూ ఉంటాం. కానీ ముందునుంచీ శరీరం మనకు కొన్ని సూచనలు ఇస్తూనే ఉంటుంది. మనమే వాటికి ఏదో ఒక సమాధానం వెతుక్కుంటూ నిర్లక్ష్యం చేస్తుంటాం. అలాకాకుండా వాటిని గమనించుకొని కాస్త జాగ్రత్తలు తీసుకొని చూడండి. ఆరోగ్యం మీ సొంతమవడం ఖాయం.

  • ఒక్కసారిగా ఒళ్లు నొప్పులు పలకరిస్తుంటాయి. మనమేం అనుకుంటాం? అంతకు ముందురోజు ఫలానా పనిచేశా. ఒకవైపే పడుకున్నా అంటూ కారణాలు వెతుక్కుంటాం. కానీ శరీరంలో పొటాషియం తగ్గినా ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు అరటిపండు, చిలగడదుంప, పాలకూర, బీట్‌రూట్, కొబ్బరినీళ్లను తరచూ ఆహారంలో చేర్చుకోండి. సమస్య తగ్గుతుంది.
  • పొట్ట దగ్గర కొవ్వు... అబ్బబ్బా త్వరగా తగ్గనే తగ్గదు. నూనెలను తగ్గించి, ఎంత నడిచినా చాలాసార్లు ప్రయోజనమే కనిపించదు. శరీరంలో ఈస్ట్రోజన్‌ స్థాయులు పెరిగినా పొట్ట పెరుగుతుందట. అలాంటప్పుడు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రకొలీ వంటి కాయగూరలతోపాటు మెంతికూర, పాలకూర, క్యారెట్‌ వంటి వాటికి ఆహారంలో చోటివ్వండి. సమస్య అదుపులోకి వచ్చేలా చేస్తాయి.
  • ఎముకలు, కండరాల వద్ద పట్టేసినట్లు అనిపించడం, నొప్పులు పలకరిస్తున్నాయా? మెగ్నీషియం తగ్గి ఉండొచ్చు. పాలకూర, జీడిపప్పు, అవకాడో, కొకోవా, గుమ్మడి విత్తనాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తిని చూడండి. చేతులు, కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతోంటే విటమిన్‌ బి12 తగ్గి ఉండొచ్చు. గుడ్లు, చీజ్, పాలను తీసుకుంటున్నారా అన్నది గమనించుకుంటే సరి.
  • చర్మం పొడిబారుతోంది, నిగారింపూ తగ్గుతోంది అనిపిస్తే ఏం చేస్తారు? సబ్బులు, క్రీములు మార్చేస్తామంటారా? ఐరన్‌ తగ్గిందేమో గమనించుకోమంటారు నిపుణులు. ఓట్స్, గుమ్మడి గింజలు, శనగలు, రెజిన్లు, జీడిపప్పు, ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమంటారు. చల్లని పదార్థాలు ముఖ్యంగా ఐస్‌వైపు మనసు లాగడం కూడా ఐరన్‌ లోపాన్ని సూచిస్తుంది. ఇంకా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, రోజూ కొద్దిసేపు వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడంపైనా దృష్టిపెడితే అనేక సమస్యలు దరి చేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి మీ శరీరమిచ్చే సూచనలను గమనించుకుంటారా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్