వంశపారంపర్య ఆస్తులు కొంటే..?

వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల్లోంచి ఓ వ్యక్తి తన వాటాను అమ్మదలుచుకున్నప్పుడు కొనే వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి ఆస్తుల పంపకానికి సంబంధించిన దస్తావేజులను (పార్టిషన్‌ డీడ్‌) కచ్చితంగా పరిశీలించాలి. దానిలో ఎవరి వాటాను వారికి క్లియర్‌గా డీమార్కేషన్‌ చేశారా, లేదా... నిబంధనల ప్రకారమే వాటాల విభజన జరిగిందా లేదా అన్నదీ సరి చూసుకోవాలి....

Updated : 22 Nov 2022 16:46 IST

వంశపారంపర్యంగా వచ్చిన ఉమ్మడి ఆస్తులను కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల్లోంచి ఓ వ్యక్తి తన వాటాను అమ్మదలుచుకున్నప్పుడు కొనే వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి ఆస్తుల పంపకానికి సంబంధించిన దస్తావేజులను (పార్టిషన్‌ డీడ్‌) కచ్చితంగా పరిశీలించాలి. దానిలో ఎవరి వాటాను వారికి క్లియర్‌గా డీమార్కేషన్‌ చేశారా, లేదా... నిబంధనల ప్రకారమే వాటాల విభజన జరిగిందా లేదా అన్నదీ సరి చూసుకోవాలి.

నిబంధనలకు అనుగుణంగానే పంపిణీ జరిగినప్పటికీ వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల్లో పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుంది. 1985 తర్వాత ఆడపిల్లలకు కూడా మన రాష్ట్రంలో ఆస్తి హక్కు కల్పించారు. 2005 తర్వాత దేశ వ్యాప్తంగా పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తిలో సమాన ఆస్తి హక్కును అమలు చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేస్తున్నప్పుడు అమ్మేవాళ్లకు ఇంకా భాగస్వాములుగానీ... మైనర్‌ హక్కులకు సంబంధించి ఏమైనా సమస్యలు గానీ వున్నాయేమో తెలుసుకోవడం మంచిది.

పిల్లలు మైనర్లుగా వున్నప్పుడు ఉమ్మడి ఆస్తులను తండ్రి అమ్మే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని కొనడం మంచిది కాదు. ఉమ్మడి ఆస్తులను అమ్మేప్పుడు ఆ వ్యక్తికి అన్‌డివైడెడ్‌ షేర్‌లో రైట్‌ మాత్రమే ఉంటుంది తప్ప మొత్తం ఆస్తి అమ్మే హక్కు వుండదు.

ముజీబ్‌ కుమార్‌, న్యాయవాది
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్