సప్లిమెంట్లకు దూరంగా...

గుదిబండలా మారిన సిలబస్, ఇండోర్‌ గేమ్స్‌ వంటివి పిల్లలను ఎండకు దూరం చేస్తున్నాయి. దీనివల్ల కలుగుతున్న విటమిన్‌ లోపాన్ని సప్లిమెంట్ల ద్వారా సరిచేయడం మంచిది కాదంటోంది లండన్‌లోని క్వీన్‌మేరీ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం.

Published : 02 Jul 2024 02:08 IST

గుదిబండలా మారిన సిలబస్, ఇండోర్‌ గేమ్స్‌ వంటివి పిల్లలను ఎండకు దూరం చేస్తున్నాయి. దీనివల్ల కలుగుతున్న విటమిన్‌ లోపాన్ని సప్లిమెంట్ల ద్వారా సరిచేయడం మంచిది కాదంటోంది లండన్‌లోని క్వీన్‌మేరీ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం. ఆ వివరాలేంటంటే...

విటమిన్‌ డి లోపంతో బాధపడే 13 ఏళ్లలోపు  పాఠశాల విద్యార్థులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. మూడేళ్లపాటు ఆ పిల్లలకు వారానికొకసారి ఈ సప్లిమెంట్‌ అందించి పరిశీలించగా దానివల్ల ప్రయోజనం ఏమీ కనిపించలేదట. అలాగే ఎముకలూ బలహీనంగానే ఉండటం గుర్తించారు. అధ్యయనం ద్వారా సహజసిద్ధంగా అందే డి విటమిన్‌ మాత్రమే కాల్షియం శోషణకు ఉపయోగపడుతుందని, అలాకాకుండా దాన్ని సప్లిమెంట్‌గా అందిస్తే అనుకున్న ప్రయోజనం దక్కదని తేలింది. రోజూ ఉదయపుటెండలో వ్యాయామం లేదా పరుగు, జంపింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడలు ఆడించాలి. అలాగే సైకిల్‌ తొక్కడంవల్ల కూడా డి విటమిన్‌ వారికి సహజసిద్ధంగా అందుతుంది. రోజూ ఉదయం అరగంటసేపు పిల్లలను ఆరుబయట ఉండేలా చేస్తే, ఎముకలు బలోపేతమవుతాయి. కండరాలు శక్తిమంతంగా మారతాయి.

ఆహారంలో మార్పులిలా...

రోజూ ఆహారంలో పిల్లలకు డి విటమిన్‌ పుష్కలంగా ఉండే ఫ్యాటీఫిష్, లివర్‌ ఆయిల్, గుడ్లు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, ఆకుకూర, తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఉండేలా చూడాలి. దీంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచాలి. రాత్రి నిర్ణీత సమయానికి నిద్ర, ఉదయం లేవడం, అలాగే శరీరానికి కావాల్సినంత నీటిని తీసుకోవడం నేర్పాలి. ఎముకల బలాన్ని హరించే చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, మైదాతో చేసే స్నాక్స్‌ వల్ల కలిగే అనారోగ్యాల గురించి అవగాహన పెంచితే చాలు. పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్