Interior decoration: గదులన్నీ పచ్చదనమే...
గ్రేప్, ఇంగ్లిష్ ఐవీ, క్రీపింగ్ ఫిగ్, ఇంచ్‌ప్లాంట్, గ్రీన్ కాయిన్స్, తమలపాకు, మనీప్లాంట్, స్విస్ చీజ్ వంటి ఇండోర్ తీగజాతి మొక్కలన్నీ గది అందాన్ని పెంచుతాయి. సాధారణంగా వీటిని టీపాయ్, డ్రెస్సింగ్ టేబుల్, కిటికీల వద్ద అలంకరణగా ఉంచుతారు. అలాగే హ్యాంగింగ్ పాట్స్‌లో పెంచుతుంటారు.
గ్రేప్, ఇంగ్లిష్ ఐవీ, క్రీపింగ్ ఫిగ్, ఇంచ్‌ప్లాంట్, గ్రీన్ కాయిన్స్, తమలపాకు, మనీప్లాంట్, స్విస్ చీజ్ వంటి ఇండోర్ తీగజాతి మొక్కలన్నీ గది అందాన్ని పెంచుతాయి. సాధారణంగా వీటిని టీపాయ్, డ్రెస్సింగ్ టేబుల్, కిటికీల వద్ద అలంకరణగా ఉంచుతారు. అలాగే హ్యాంగింగ్ పాట్స్‌లో పెంచుతుంటారు. వీటి తీగలు పెరిగి కిందికి జారుతున్నట్లుగా చూడటానికి అందంగా కనిపిస్తాయి. అలాగే వీటిని గుమ్మాలకు పాకించాలంటే తీగల సాయాన్ని అందించాలి. అలాకాకుండా గది సీలింగ్‌కు, గోడలకు వీటిని అల్లించొచ్చు. తీగలు, మేకులు లేకుండానే గది గోడలంతా పాకిస్తూ... ఇంటికి కొత్త అందాల్ని అద్దొచ్చు.
క్లిప్స్‌తో..
ముందుగది సోఫా వెనుక మనీప్లాంట్ తొట్టెనుంచి మొక్క ఎదిగేటప్పుడు తీగలు గోడకు అంటినట్లు ఉండేలా ఇప్పుడు క్లిప్స్ వస్తున్నాయి. వీటి వెనుక ఉండే జిగురు తీగలను గోడకు అతుక్కొనేలా చేస్తుంది. దీన్లో కొమ్మను ఉంచి సన్నటి ప్లాస్టిక్ తీగను నొక్కితే చాలు. అలా గోడంతా తీగలను మనకు కావాల్సిట్లుగా సోఫా వెనుకవైపు వచ్చేలా ఏర్పాటు చేయొచ్చు. తీగలు పెరిగే కొద్దీ క్లిప్స్ సాయంతో గోడకు అతికిస్తూ ఉంటే చాలు. గోడ పెయింటింగ్ వర్ణంలో కూడా ఈ వాల్‌క్లిప్స్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. మొక్క పెరుగుతున్న కొద్దీ గోడంతా పచ్చదనం విస్తరించినట్లుగా అనిపిస్తుంది.
రూఫ్ భాగంలో..
వరండా, పడకగదుల్లో నాలుగు గోడలు సహా సీలింగ్ భాగంలోనూ స్విస్ చీజ్ లేదా ఇంగ్లిష్ ఐవీ ప్లాంట్స్‌ను పెంచొచ్చు. గది మూల ఎత్తైన స్టూలుపై మొక్కనుంచిన తొట్టె సర్దాలి. ఆ తర్వాత పెరిగే వీటి తీగలను గోడలంతా క్లిప్స్ సాయంతో అతికిస్తూ వెళ్లాలి. ముదురు వర్ణం గోడలపై ఈ తీగలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. టెడ్డీ బేర్ వైన్ మొక్కను కూడా ఇలా గది గోడలకు పాకించొచ్చు. నీటి చుక్క ఆకారంలో, చాక్లెట్ బ్రౌన్ వర్ణంలో ఉండే ఈ మొక్క ఆకులు లేత, ముదురు వర్ణం గోడలకు మరింత ఆకర్షణ తెచ్చిపెడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.