Updated : 18/10/2021 18:59 IST

ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగిస్తున్నారా?

సహజసిద్ధమైన గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో గృహిణులు ఉపయోగిస్తున్నది - ఇండక్షన్ స్టవ్. అయితే మామూలు స్టవ్‌తో పోలిస్తే దీని వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందుల పాలవ్వక తప్పదు. ఈ క్రమంలో ఇండక్షన్ స్టవ్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి తెలుసుకుందామా..!

* చాలామందికి ప్రతి వస్తువు కింద వస్త్రాన్ని పరిచే అలవాటు ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ విషయంలోనూ అదే చేస్తారు. ఇలా చేయడం వల్ల దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడికి కింద ఉన్న వస్త్రం కాలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా స్టవ్ కూడా పాడవ్వచ్చు. కాబట్టి ఇండక్షన్ స్టవ్ కింద పేపర్ లేదా క్లాత్ లాంటివి పరచకూడదు.

* ఇండక్షన్ స్టవ్ విద్యుత్‌తో పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనిని చెక్క టేబుల్‌పైన పెట్టడం మంచిది. అంతేకాకుండా సిరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్టవ్‌ని మెటల్ టేబుల్ పైన మాత్రం పెట్టకూడదు. దీనివల్ల షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* ఇండక్షన్ స్టవ్ వాడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు దానికి సరిపోయే పాత్రలనే వాడడం మంచిది.

* కొందరు ఇండక్షన్ స్టవ్‌ని సైతం గ్యాస్ స్టవ్ పక్కనే పెడుతూ ఉంటారు. దీనివల్ల సాధారణ సందర్భాల్లో ఎటువంటి నష్టం కలగదు. కానీ ఎప్పుడైనా పొరపాటున గ్యాస్ లీకైతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

* ఇండక్షన్ స్టవ్‌ని రేడియోలు, టీవీలు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే అయస్కాంత క్షేత్రప్రభావం వల్ల అవి పాడైపోయే అవకాశాలున్నాయి.

* ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్‌టెన్షన్ ప్లగ్‌బాక్సులకు ఇండక్షన్ స్టవ్ ప్లగ్‌ని అనుసంధానించకూడదు.

* మనలో చాలామందికి ఉన్న అలవాటు ఇంట్లో ఉన్న సామాను అంతటినీ సబ్బుతో రుద్ది రుద్ది తోమడం. అదే పనిని ఇండక్షన్ స్టవ్ విషయంలోనూ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇలా చేస్తే అది పాడైపోయే ప్రమాదం ఉంది. నీటిని ఉపయోగించకుండా మెత్తని వస్త్రంతో మాత్రమే దీనిని తుడవాలి.

* ఇండక్షన్ స్టవ్‌కి ఉన్న రంధ్రాల్లో దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి.

* స్టవ్‌కి ఏమైనా పగుళ్లు వచ్చినట్లనిపిస్తే దానిని ఉపయోగించకూడదు.

* అలాగే స్టవ్‌కి దగ్గరలో ఎటువంటి లోహసామగ్రిని ఉంచకూడదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని