Asmi Jain: ఆపిల్‌ని మెప్పించింది!
కోడింగ్‌లో రాణించాలనుకునేవారు టెక్ సంస్థల పోటీల్లో పాల్గొనడం మామూలే! కానీ అది సాంకేతికంగా ముందుకు దూసుకెళ్లడమే కాదు.. మానవాళికీ ప్రయోజనకరంగా ఉండాలని నమ్మింది అస్మి జైన్. అదే ఆమెను ‘ఆపిల్’ అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలబెట్టింది.
కోడింగ్‌లో రాణించాలనుకునేవారు టెక్ సంస్థల పోటీల్లో పాల్గొనడం మామూలే! కానీ అది సాంకేతికంగా ముందుకు దూసుకెళ్లడమే కాదు.. మానవాళికీ ప్రయోజనకరంగా ఉండాలని నమ్మింది అస్మి జైన్. అదే ఆమెను ‘ఆపిల్’ అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలబెట్టింది.
అస్మి జైన్‌ది ఇందౌర్. మెడికాప్స్ యూనివర్సిటీలో చదువుతోంది. కోడింగ్‌పై ఆసక్తి. స్నేహితులకు, చుట్టూ ఉన్నవాళ్లకు సాయపడేలా యాప్‌లు, ప్రోగ్రామ్‌లు రూపొందిస్తుంటుంది. అలా సాయపడటం ఆమెకో సరదా, సంతృప్తి. తన స్నేహితురాలి బంధువుకి తలకి సర్జరీ జరగడంతో కంటి చూపులో తేడాతోపాటు.. ముఖ పక్షవాతమూ వచ్చింది. ఆయన కళ్లకు వ్యాయామం అయ్యేలా అస్మి ఓ యాప్ తయారు చేసింది. అప్పుడే ఈమెకు ‘ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్’ గురించి తెలిసి, తన ఆవిష్కరణను దానికి పంపింది. ఆపిల్ సంస్థ కోడింగ్ విద్యార్థుల కోసం ఏటా దీన్ని నిర్వహిస్తుంది. 30 దేశాల విద్యార్థులు దీనిలో పాల్గొంటే ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. వారిలో మన అస్మి ఒకరు. విజేతలకు ఆపిల్ ఉత్పత్తులతోపాటు ఏడాది డెవలపర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే వీలూ కల్పిస్తారు. ‘ఈ విజయం ఆనందాన్నిచ్చింది. ఈ యాప్‌ని తుది మార్పుల తర్వాత యాప్‌స్టోర్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తా. తర్వాత ముఖ కండరాల వ్యాయామానికీ ఓ యాప్ తీసుకు రానున్నా’ అంటోందీ 20 ఏళ్ల అమ్మాయి. ఈ పోటీని చాలా కష్టమైనదిగా చెబుతారంతా. కానీ అస్మి దీన్ని తొలిప్రయత్నంలోనే సాధించడం విశేషమని ప్రశంసిస్తున్నారు టెకీలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.