5 నిమిషాల్లో జ్యూస్ రడీ!

ఫ్రూట్ జ్యూస్‌లు చేసుకోవాలంటే ఆ పండ్లను శుభ్రం చేసుకోవడం, తరగడం తప్పదు.. దానికి బద్ధకించి కొందరు బయట దొరికే జ్యూస్‌లను తాగేస్తారు. వాటిలో విపరీతమైన చక్కెర, ప్రిజర్వేటివ్స్ వాడడం....

Published : 08 Jun 2023 20:35 IST

ఫ్రూట్ జ్యూస్‌లు చేసుకోవాలంటే ఆ పండ్లను శుభ్రం చేసుకోవడం, తరగడం తప్పదు.. దానికి బద్ధకించి కొందరు బయట దొరికే జ్యూస్‌లను తాగేస్తారు. వాటిలో విపరీతమైన చక్కెర, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇలా జరగకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లో పండ్ల రసం తయారు చేసుకోవాలంటే.. ఇలా చేయండి.

మీకు నచ్చిన పండుని (యాపిల్, ఆరెంజ్, బత్తాయి తప్ప) శుభ్రం చేసి, తరుక్కుని నీరు కలపకుండా కొద్దిగా నిమ్మరసం వేసి ప్యూరీలా తయారు చేసుకోవాలి. దీన్ని ఫ్రీజర్‌లో రెండు రోజుల పాటు ఉంచాలి. తర్వాత క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లోకి మార్చాలి. వీటిని ఫ్రీజర్‌లో ఉంచితే రెండు నెలలు పాడవకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటితో జ్యూస్ చేసుకోవచ్చు.

మూడు నెలలకు సరిపడ నిమ్మరసం...

ఎండల్లో నిమ్మరసం తాగాలని ఎవరికుండదు చెప్పండి..! కానీ హడావుడిలోనో, అలసటతోనో, నిమ్మరసం కలుపుకోలేక మంచినీళ్లతో సరిపెట్టుకుంటాం. అయితే ఓ అరగంట కేటాయిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం తాగేయొచ్చు. అదెలాగో తెలుసుకుందామా..

నిమ్మకాయలు రసం తీసి, అందులో కాస్త ఉప్పు కలపాలి. అలాగే కొన్ని నిమ్మకాయలను రసం తీయకుండా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఐస్‌ట్రేలో నిమ్మరసాన్ని నింపి క్యూబ్‌కి ఒకటి చొప్పున తరిగిన నిమ్మకాయ ముక్కలనీ, నచ్చితే ఓ పుదీనా ఆకునీ వేసి రెండు రోజులపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. క్యూబ్స్ తయారవగానే జిప్‌లాక్ కవర్‌లోకి చేర్చి ఫ్రీజర్‌లో భద్రపరిస్తే మూడు నెలల పాటు వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్