Interesting Facts: జీవితంలో నాలుగేళ్లు దానికే!

ఈ ప్రపంచంలో మహిళలుగా మనకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ పనినైనా చేపట్టి అందులో విజయం సాధించగల నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయి. అయితే అనుకున్నది సాధించగల ఓర్పు, నేర్పు మాత్రమే కాదు.. వివిధ అంశాలకు సంబంధించి మరెన్నో ప్రత్యేకతలు.....

Updated : 30 May 2022 18:34 IST

ఈ ప్రపంచంలో మహిళలుగా మనకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ పనినైనా చేపట్టి అందులో విజయం సాధించగల నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయి. అయితే అనుకున్నది సాధించగల ఓర్పు, నేర్పు మాత్రమే కాదు.. వివిధ అంశాలకు సంబంధించి మరెన్నో ప్రత్యేకతలు మన సొంతం.. ఈ క్రమంలో మనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం రండి..

* ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పయనిస్తోంది. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్తో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అయితే మొట్టమొదట కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ చేసింది ఒక మహిళే అన్న విషయం మీకు తెలుసా?. అవును.. లండన్‌కు చెందిన అడా లవ్‌లేస్ అనే మహిళ 1843 వ సంవత్సరంలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ చేశారు.

* పురుషులతో పోల్చుకుంటే మనలో రకరకాల రంగులను గుర్తించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయంలో 20 శాతం ఎక్కువ కచ్చితత్వంతో గుర్తిస్తామట. ఉదాహరణకు పురుషులు నీలం రంగును ఒక్కటే గుర్తించగలిగితే,  మహిళలు అందులోనే ఉండే మరో నాలుగు వైవిధ్యాలను కూడా గుర్తించగలరట.

* రుచిని గుర్తించడంలో మనమే టాప్‌. ఎందుకంటే నాలుకలో ఉండే రుచి మొగ్గలు మగవారి కంటే మనలోనే ఎక్కువగా ఉంటాయట.

* రోజులో ఒక మహిళ సుమారు 20 వేల పదాలను ఉచ్చరిస్తుందట. అదే పురుషులైతే కేవలం 7 వేల పదాలను మాత్రమే మాట్లాడతారట. మెదడులో ఉండే కొన్ని రకాల ప్రొటీన్లే ఇందుకు కారణమని పరిశోధనల్లో వెల్లడైంది.

* పురుషుల కంటే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుందట. పురుషుల గుండె నిమిషానికి 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటే అదే మహిళల గుండె 78 నుంచి 82 సార్లు కొట్టుకుంటుందట.

* నెలసరి సమయంలో మహిళలుగా మనం పలు రకాల సమస్యలను ఎదుర్కొంటుంటాం. అయితే మన జీవిత సమయంలో దాదాపు నాలుగు సంవత్సరాలు నెలసరిలోనే గడుపుతామట.

* ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గిపోతోందని వింటూనే ఉంటాం. కానీ, రష్యాలో మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. అక్కడ మగవారి కంటే దాదాపు కోటి మంది మహిళలు ఎక్కువగా ఉన్నారట.

* ప్రతి మహిళ మాతృత్వాన్ని ఎంతో ఆనందిస్తుంది. ఈ క్రమంలో- ఇప్పటికీ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు లేకపోలేదు. అయితే ఇప్పటివరకు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన వసిల్యేవా పేరు మీదే ఉంది. ఆమెకు 69 మంది సంతానం. ఆమె నాలుగు సార్లు నలుగురు, ఏడు సార్లు ముగ్గురు, పదహారు సార్లు కవలలకు జన్మనిచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్