Radhika Merchant: పెళ్లికి ముందే అత్తకు తగ్గ కోడలనిపించుకుంది!
కోడలంటే అటు పుట్టింటి అనురాగాన్ని, ఇటు మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టాలంటారు. శ్రీమంతురాలు నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. భరతనాట్యంలో ఆరితేరిన ఆమె.. తాజాగా ఈ సంప్రదాయ....
(Photos: Instagram)
కోడలంటే అటు పుట్టింటి అనురాగాన్ని, ఇటు మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టాలంటారు. శ్రీమంతురాలు నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. భరతనాట్యంలో ఆరితేరిన ఆమె.. తాజాగా ఈ సంప్రదాయ నృత్యంలో ‘అరంగేట్రం’ చేసింది. తన అద్భుతమైన ప్రదర్శనతో ఇటు అత్తింటి వారినే కాదు.. అటు దేశంలోని మహామహుల్నీ మెప్పించింది. కాబోయే అత్తమామలు ముఖేశ్-నీతా అంబానీలే రాధిక కోసం ప్రత్యేకంగా ‘అరంగేట్రం’ కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ ఆమెను ప్రోత్సహించడంతో ఆమె నాట్య నైపుణ్యాలు అందరికీ పరిచయమయ్యాయి. మరోవైపు నీతా అంబానీ కూడా భరతనాట్య కళాకారిణే కావడంతో.. రాధిక పెళ్లికి ముందే అత్తగారికి తగ్గ కోడలనిపించుకుందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీకి కాబోయే ‘ఛోటీ బహూ’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!
రాధికా మర్చంట్.. 2018లో ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్‌ల వివాహ వేడుక సమయంలోనే ఈ పేరు ఎక్కువగా వినిపించిందని చెప్పచ్చు. ‘ఎన్కోర్ హెల్త్‌కేర్’ సంస్థ సీఈఓ విరెన్ మర్చంట్-శైలజా మర్చంట్ల గారాల పట్టి రాధిక. ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే భార్య. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్నాళ్లు పనిచేసింది. చేసే పని పట్ల నిబద్ధతను కనబరిచే రాధిక.. ‘నచ్చిన పనిలో దొరికిన సంతోషం మరెందులోనూ పొందలేం’ అంటూ ఓ సందర్భంగా చెప్పుకొచ్చింది.
నవరసాలు పండిస్తూ..!
రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్న వయసు నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుందామె. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న రాధికకు.. కాబోయే అత్తమామలు ముకేశ్-నీతాలు ఘనంగా ‘అరంగేట్రం’ కార్యక్రమం ఏర్పాటుచేశారు. జియో వరల్డ్ సెంటర్ ఇందుకు వేదికైంది. ఇందులో భాగంగా అంబానీ, మర్చంట్ కుటుంబాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో తన భరతనాట్యంతో అదరగొట్టింది రాధిక. నాట్య ప్రదర్శనలో భాగంగా ఆమె పలికించిన నవరసాలు, హావభావాలు.. ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. ప్రదర్శన అనంతరం నీతా రాధికను తన గుండెలకు హత్తుకొని మరీ ప్రశంసించారు. అయితే నీతాకు కూడా భరతనాట్యంలో ప్రవేశం ఉంది. దీంతో రాధిక ప్రదర్శన చూసిన వారంతా ‘పెళ్లికి ముందే అత్తకు తగ్గ కోడలనిపించుకుంది’, ‘కాబోయే అత్తగారి అడుగుజాడల్లో నడుస్తోంది’.. అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇలా ఆమె ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఆ ఫొటోలే సాక్ష్యం!
మర్చంట్ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇదే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మధ్య ప్రేమకు దారితీసిందని చెప్పచ్చు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు.
ఆఖరికి 2018లో ఇషా-ఆనంద్, 2019లో ఆకాశ్-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతి వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్ వేడుకలో కుటుంబంతో కలిసి.. అనంత్‌కు జంటగా డ్యాన్స్ చేయడం, ఫ్యామిలీ ఫొటోల్లోనూ కనిపించడంతో.. అందరూ ఆమే నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలు అనుకున్నారు. ఇక వీటితో పాటు అనంత్-రాధికలు కలిసి దిగిన కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాదు.. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ వివాహంలోనూ రాధిక అంబానీ కుటుంబంతో కలిసి వేడుకలకు హాజరైంది.
‘సింపుల్ అండ్ స్వీట్’ గర్ల్!
❃ పుట్టింది గొప్పింటి వ్యాపార కుటుంబంలోనే అయినా.. వ్యక్తిగతంగా ఎంతో సింపుల్‌గా కనిపిస్తుంది రాధిక. చాలా వరకు ఆయా వేడుకల్లో సంప్రదాయబద్ధంగా కనిపించడానికే ఆసక్తి చూపుతానంటోంది.
❃ చదువు పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగొచ్చాక కొన్నేళ్లు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత తన మనసును సమాజ సేవ వైపు మళ్లించింది. ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలిసి పనిచేస్తోన్న రాధిక.. మరో పక్క తన తండ్రి ఆరోగ్య సంస్థ వేదికగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
❃ ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌ను ఇష్టపడతానంటోంది రాధిక. ‘ట్రెక్కింగ్‌లో దొరికే ఆనందం, ప్రశాంతత మరెందులోనూ దొరకదం’టూ ఈ యాక్టివిటీపై తనకున్న ప్రేమను ఓ సందర్భంలో చాటుకుందామె.
❃ రాధికకు కాఫీ అంటే చాలా ఇష్టమట! ఇంట్లోనే కాదు.. ఆఫీస్‌లో ఉన్నా కాఫీతో రిలాక్సవుతానంటోందీ కాఫీ లవర్.
❃ ‘ఏ పనైతే సమాజానికి ఉపయోగపడుతుందనిపిస్తుందో.. ఆ పని చేయడానికే ఇష్టపడతా.. అప్పుడే కదా మనకు ఆత్మ సంతృప్తి..’ అంటూ పని పట్ల తనకున్న అంకితభావాన్ని, సమాజం పట్ల ఉన్న బాధ్యతను ఓ సందర్భంలో పంచుకుంది రాధిక.
❃ నీతా అంబానీకి కాబోయే ఈ కోడలు పిల్ల మంచి ఫ్యాషనర్ కూడా! ఈ విషయం ఆయా సందర్భాల్లో ఆమె ధరించే హుందా దుస్తులే చెబుతాయి.
❃ మరోవైపు ఆరోగ్యం, ఫిట్నెస్ పైనా దృష్టి పెడతానంటోంది రాధిక. ఈ క్రమంలో తన రోజువారీ రొటీన్లో వ్యాయామాలు తప్పకుండా ఉంటాయని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!