పిరియడ్స్ రావడం లేదు.. ఆ మాత్రే కారణమా?

నమస్తే డాక్టర్. నా వయసు 39. ఈమధ్య కొన్ని సందర్భాల్లో నెలసరి రాకుండా ఉండేందుకు మూడు Primolut-N మాత్రలు వేసుకున్నా. అవి ఆపేశాక ఒకసారి పిరియడ్స్ మామూలుగానే వచ్చినా, ఆ తర్వాత నుంచీ రెగ్యులర్‌గా రావడం లేదు. నాకు సాధారణంగా 28 రోజులకే నెలసరి వస్తుంటుంది. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాను. Sysron-N 5mg ట్యాబ్లెట్స్ మూడు రోజులకు రాసిచ్చారు. మొదటి ట్యాబ్లెట్ వేసుకున్న మూడు గంటలకు కొద్దిగా బ్లీడింగ్ అయింది...

Published : 02 Mar 2022 21:25 IST

నమస్తే డాక్టర్. నా వయసు 39. ఈమధ్య కొన్ని సందర్భాల్లో నెలసరి రాకుండా ఉండేందుకు మూడు Primolut-N మాత్రలు వేసుకున్నా. అవి ఆపేశాక ఒకసారి పిరియడ్స్ మామూలుగానే వచ్చినా, ఆ తర్వాత నుంచీ రెగ్యులర్‌గా రావడం లేదు. నాకు సాధారణంగా 28 రోజులకే నెలసరి వస్తుంటుంది. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాను. Sysron-N 5mg ట్యాబ్లెట్స్ మూడు రోజులకు రాసిచ్చారు. మొదటి ట్యాబ్లెట్ వేసుకున్న మూడు గంటలకు కొద్దిగా బ్లీడింగ్ అయింది. డాక్టర్‌కి ఫోన్ చేసి అడిగితే ట్యాబ్లెట్ ఆపేయమన్నారు. ఆ తర్వాత ఒక రోజు గడిచినా బ్లీడింగ్ కాకపోయేసరికి మళ్లీ డాక్టర్‌కి ఫోన్ చేస్తే మిగతా ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. కోర్సు పూర్తయినా ఒక రోజు గడిచినా బ్లీడింగ్ మాత్రం కావట్లేదు. నేను పిరియడ్ రాకుండా ట్యాబ్లెట్స్ వాడడం ఇదే తొలిసారి. ప్రతినెలా నాకు పిరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇప్పుడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మళ్లీ నాకు పిరియడ్స్ రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: మీరు అప్పుడప్పుడు Primolut-N మాత్రలు వేసుకొని ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. రుతుచక్రం అనేది ఒక సహజమైన శరీర ధర్మం. దాన్ని మార్చడం కోసం మనం ఎన్నిసార్లు మందులు వాడితే అంత ప్రమాదం. అంతేకాదు.. దీనివల్ల మీ పిరియడ్ సైకిల్ మొత్తం ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని చూసుకోండి. మీకు యుటరస్, ఓవరీస్‌లో ఎలాంటి సమస్య లేకపోతే ఈ మందులు వాడడం మానేసి కొన్నాళ్ల పాటు మీ సైకిల్ తిరిగి రెగ్యులర్ అవుతుందేమో చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్