ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్.. ప్రమాదకరమా?
హలో డాక్టర్. నాకు పెళ్లై ఏడాదైంది. ప్రస్తుతం నేను నాలుగు నెలల గర్భిణిని. ఈ సమయంలో నాకు రోజూ కాస్త బ్లీడింగ్ అవుతోంది. ఏం చేయాలి? ఇలా జరగడం....
హలో డాక్టర్. నాకు పెళ్లై ఏడాదైంది. ప్రస్తుతం నేను నాలుగు నెలల గర్భిణిని. ఈ సమయంలో నాకు రోజూ కాస్త బ్లీడింగ్ అవుతోంది. ఏం చేయాలి? ఇలా జరగడం ప్రమాదకరమా? - ఓ సోదరి
జ: గర్భవతిగా ఉన్నప్పుడు రక్తస్రావం జరగడం మంచిది కాదు. ఎందుకంటే తొలి త్రైమాసికంలో బ్లీడింగ్ తరచూ అవుతున్నప్పుడు గర్భస్రావం జరగడం, బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, నెలలు నిండకుండా కాన్పు జరగడం.. వంటి సమస్యలు తరచుగా తలెత్తుతాయి. మీరు డాక్టర్‌తో చెకప్ చేయించుకున్నప్పుడు మీకు ఇలా తరచూ బ్లీడింగ్ అవడానికి కారణమేంటో తెలుసుకొని తగిన చికిత్స చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.