జంక్‌ఫుడ్‌ తీసుకుంటే గుండె సమస్యలొస్తాయా?

నా వయసు 28 సంవత్సరాలు. నేను స్నేహితులతో కలిసి సినిమాలకు, షాపింగ్‌లకు వెళ్లినప్పుడు ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తింటుంటాను. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది నిజమేనా? దయచేసి...

Published : 20 Feb 2023 18:47 IST

నా వయసు 28 సంవత్సరాలు. నేను స్నేహితులతో కలిసి సినిమాలకు, షాపింగ్‌లకు వెళ్లినప్పుడు ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తింటుంటాను. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది నిజమేనా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సందర్భమేదైనా ఈ రోజుల్లో చాలామంది జంక్‌ఫుడ్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పిజ్జాలు, బర్గర్లలో చెడు కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. సినిమాలు, షాపింగ్‌లకు వెళ్లినప్పుడూ జంక్‌ఫుడ్‌ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. చిన్నపిల్లల్ని కూడా సాయంత్రం కాగానే బయటకు తీసుకెళ్లి స్నాక్స్‌ కొనిపెడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. వీటిల్లో కొవ్వు అధికంగా ఉండడమే కాకుండా.. ఇందులో ఉపయోగించే నూనెను పదే పదే వేడి చేస్తుంటారు. ఇలాంటి పదార్థాల్ని ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, అత్యంత అరుదుగా అయితే పర్లేదు.. కానీ ప్రతిసారీ అంటే మాత్రం.. బయటికి వెళ్లినప్పుడు ఇంటి నుంచి పండ్లు, సలాడ్స్‌ వంటివి తీసుకెళ్లడం మంచిది. ఒకవేళ వాటిని తీసుకెళ్లలేకపోతే.. బయట దొరికే డ్రైఫ్రూట్స్‌, ఫ్రూట్‌ సలాడ్‌.. వంటివి తినచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, జీవనశైలిని పాటించడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యమూ మన సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్