ప్రసవం తర్వాత ఈ నొప్పులు సహజమేనా?

నమస్తే డాక్టర్‌. నాకు పాప పుట్టి ఏడాది దాటింది. సహజ ప్రసవం కోసం ప్రయత్నించినా కాకపోయే సరికి సిజేరియన్‌ చేశారు. అయితే ఆ తర్వాత నాకు కటి వలయంలో నొప్పులు ఎక్కువగా వచ్చాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే పరీక్షలు చేసి సమస్య లేదన్నారు. అయినా ఇప్పటికీ నొప్పులు తగ్గట్లేదు. పడుకున్నప్పుడు, పక్కకు తిరిగినప్పుడు.. ఇలా భంగిమ మార్చినప్పుడల్లా

Updated : 31 Mar 2022 17:26 IST

నమస్తే డాక్టర్‌. నాకు పాప పుట్టి ఏడాది దాటింది. సహజ ప్రసవం కోసం ప్రయత్నించినా కాకపోయే సరికి సిజేరియన్‌ చేశారు. అయితే ఆ తర్వాత నాకు కటి వలయంలో నొప్పులు ఎక్కువగా వచ్చాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే పరీక్షలు చేసి సమస్య లేదన్నారు. అయినా ఇప్పటికీ నొప్పులు తగ్గట్లేదు. పడుకున్నప్పుడు, పక్కకు తిరిగినప్పుడు.. ఇలా భంగిమ మార్చినప్పుడల్లా తీవ్రమైన నొప్పి వేధిస్తోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఇదేమైనా సమస్యా? చెప్పండి. - ఓ సోదరి

జ: కొంతమందికి కాన్పు తర్వాత ఇలాంటి సమస్య ఎదురవడం సహజం. గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో ఎముకల మధ్య ఎడం కొద్దిగా ఎక్కువై.. ఆ ప్రభావం కండరాలు, లిగమెంట్లు, నరాల మీద పడి.. పడుకున్నప్పుడు, పక్కకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ నొప్పి ముఖ్యంగా పొత్తి కడుపు కింద భాగంలో ఉన్న ప్యూబిక్‌ ఎముకల వద్ద కానీ లేదా సేక్రో-ఇలియక్‌ జాయింట్‌లో కానీ వస్తుంది. దీనికి ఒకసారి పరీక్షించి చూడాలి. ఒకవేళ ఎముకల మధ్య జాయింట్‌లో ఎడం కనుక ఎక్కువైతే దానికి ప్రత్యేకమైన చికిత్సలుంటాయి. ఇందుకోసం ఆర్థోపెడిక్‌ సర్జన్‌ని సంప్రదిస్తే తగిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తారు. దాంతో కూడా సమస్య తగ్గకపోతే ఒక్కోసారి దూరమైన ఎముకల్ని దగ్గరికి చేర్చడానికి స్ట్రాపింగ్‌ పద్ధతిలో చికిత్స చేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్