జాబ్ కొట్టాలంటే ఇవి ఉండాల్సిందే!

మంచి అకడమిక్ ట్రాక్ రికార్డు ఉంటే చాలు.. ఉద్యోగం దానంతటదే వస్తుందనే భావనలో ఉంటారు చాలామంది. అయితే మంచి మార్కులతో పాస్ కావడమనేది ఉద్యోగ వేటలో కొంతవరకే అక్కరకొస్తుంది. తెలివితేటలు, ప్రతిభతో పాటు కష్టపడి పనిచేసే తత్వం, చురుగ్గా ఆలోచించే సామర్థ్యం.....

Published : 23 Mar 2022 20:02 IST

మంచి అకడమిక్ ట్రాక్ రికార్డు ఉంటే చాలు.. ఉద్యోగం దానంతటదే వస్తుందనే భావనలో ఉంటారు చాలామంది. అయితే మంచి మార్కులతో పాస్ కావడమనేది ఉద్యోగ వేటలో కొంతవరకే అక్కరకొస్తుంది. తెలివితేటలు, ప్రతిభతో పాటు కష్టపడి పనిచేసే తత్వం, చురుగ్గా ఆలోచించే సామర్థ్యం, చొరవ, బాధ్యతలు తీసుకోవడం... లాంటి ఎన్నో అంశాలు ఉద్యోగం సాధించే విషయంలో ప్రభావం చూపుతాయి. ఇలా ఉద్యోగానికి అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నప్పుడే కొలువు ఖాయమవుతుంది.

చాలాసార్లు అకడమిక్స్‌లో ఎక్కువ మార్కులు పొందినవారి కంటే తక్కువ మార్కులు వచ్చినవాళ్లే వేగంగా ఉద్యోగం సంపాదించడాన్ని మనం చూస్తూ ఉంటాం. దీంతో ఎంపికలో ఏదో లోపం ఉందని భావించేవారూ లేకపోలేదు. అదృష్టం వల్లే ఇది సాధ్యమైందనేవాళ్లూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో ఉద్యోగం రావడానికి కేవలం పర్సంటేజీలొక్కటే సరిపోవు. పనిచేయడానికి అవసరమైన మెలకువలన్నీ సమృద్ధిగా ఉంటేనే జాబ్ మన సొంతమవుతుంది. అందుకే దానికి తగిన లక్షణాలు పెంపొందించుకోవాలి. అవేంటంటే.. 

* సాధారణ పరిమితులకు మించి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి.

* సంబంధిత రంగంలో వస్తున్న మార్పులు, కొత్త పోకడలపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. వాటిని పనికి ఎలా అన్వయించవచ్చో ఆలోచించే నేర్పరితనం కూడా ఉండాలి.

* ఇతరులతో చక్కగా మాట్లాడగలగాలి. ఉద్యోగంలో సహచరులతో కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం తప్పనిసరి. కాబట్టి సంభాషణా చాతుర్యాన్ని పెంపొందించుకోవాలి.

* భావవ్యక్తీకరణ శక్తి మెండుగా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి.. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఈ ఎటికెట్స్ తెలియని వాళ్లకి ఉద్యోగం పొందే అవకాశాలు చాలా తక్కువని చెప్పచ్చు. 

* చక్కని దార్శనికత, చొరవ తప్పనిసరి.

* లోకజ్ఞానంతోపాటు తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి.

* నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి మెండుగా ఉండాలి.

* పనిచేయాలనుకున్న సంస్థపై అవగాహన, సదభిప్రాయం తప్పనిసరి.

* సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. నిరాశావాదం ఏమాత్రం పనికిరాదు.

* ప్రాథమ్యాలను గుర్తించగలగాలి. సమయపాలన చాలా కీలకం.

* కొత్త అంశాలు నేర్చుకోవడానికి, కొత్త టెక్నాలజీతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.

* ఒత్తిడిలోనూ పనిచేయగలిగే సామర్థ్యం పెంపొందించుకోవాలి.

* ఉద్వేగాలను అదుపులో పెట్టుకోగలగాలి.

* వాయిదా వేసే తత్వం ఏ మాత్రం పనికిరాదు. బద్ధకాన్ని జయించాలి.

* కష్టపడే తత్వం మెండుగా ఉండాలి.

* అందరూ మెచ్చుకోగలిగే వ్యవహారశైలిని అలవాటు చేసుకోవాలి. అంటే మంచి టీమ్ ప్లేయర్‌గా ఉండాలి. దీనికోసం పారదర్శకంగా ఉంటూ, తోటి ఉద్యోగులకు పనిలో వీలైనంత సాయం చేయగలగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్