మండే వేసవిలో.. చల్లచల్లగా..!
శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. బరువు అదుపులో ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖం కొత్త నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందుకు కొన్ని రకాల పానీయాలు....
శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. బరువు అదుపులో ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖం కొత్త నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందుకు కొన్ని రకాల పానీయాలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి మండే వేసవిలో ఇటు చల్లదనాన్ని, అటు అదనపు పోషకాలనీ అందించే పానీయాలు.. మీ కోసం..
బత్తాయి+ అల్లం+ దాల్చిన చెక్క
బత్తాయిని సన్నటి చక్రాల్లా తరిగి చల్లటి నీళ్లల్లో వేయాలి. దానిలో అల్లం ముక్క, అయిదారు పుదీనా ఆకులు, దాల్చిన చెక్క వేసి నాననివ్వాలి. బత్తాయి నుంచి విటమిన్- సి తగినంతగా లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జింక్, క్యాల్షియం.. ఖనిజాలు అల్లంలో తగినంతగా లభిస్తాయి. దాల్చినచెక్కలోని పోషకాలు రక్త సరఫరాని మెరుగుపరుస్తాయి. ఈ పానీయం తాగితే ఆరోగ్యంతో పాటు చర్మం మెరుస్తుంది.
కీరదోస+ పుదీనా+ నిమ్మ
గాజు సీసాలో చల్లటి నీళ్లు పోసి... కీరదోసని పలుచటి చక్రాల్లా తరిగి వేయాలి. పుదీనా ఆకులు, సన్నగా తరిగిన రెండు నిమ్మకాయ స్లైసులు వేసి నాలుగైదు గంటలు నాననివ్వాలి. ఈ పానీయం శరీరాన్ని చల్లబరిచి సాంత్వననిస్తుంది.
పుచ్చకాయ+ కొబ్బరి నీళ్లు+ తులసి
కప్పు పుచ్చకాయ ముక్కల్లో కొన్ని కొబ్బరినీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కాసిన్ని తులసి ఆకులు వేసుకుని తాగితే చాలు. పుచ్చకాయలోని లైకోపిన్ శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. కొబ్బరి నీళ్ల నుంచి పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం తగినంతగా లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. తులసి యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది.
ఈ పానీయాలను కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి ఆ తర్వాత తీసుకోవచ్చు.. లేదంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లచల్లగా తీసుకోవచ్చు..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.