ఆన్లైన్ దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్పుతోంది!
కరోనా కాలంలో అందరూ ‘ఆన్లైన్’ బాట పట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా పెద్దలు...డిజిటల్ తరగతుల కోసం పిల్లలు...ఇలా ఏదో ఒక విధంగా నిత్యం అంతర్జాలంలోనే గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టిస్తూ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో స్త్రీలను వేధిస్తున్నారు. ఖాతాదారాలకు తెలియకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఇంకా ఎన్నెన్నో మోసాలు, దురాగతాలకు పాల్పడుతున్నారు.
Photo: Twitter
కరోనా కాలంలో అందరూ ‘ఆన్లైన్’ బాట పట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా పెద్దలు...డిజిటల్ తరగతుల కోసం పిల్లలు...ఇలా ఏదో ఒక విధంగా నిత్యం అంతర్జాలంలోనే గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టిస్తూ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో స్త్రీలను వేధిస్తున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఇంకా ఎన్నెన్నో మోసాలు, దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తూ, ఈ అంశంపై శిక్షణనిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల కామాక్షి శర్మ. సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టున్న ఈ యువతి.. సుమారు 30 నగరాల్లో పర్యటించి, సైబర్ నేరాల నియంత్రణపై 50వేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చింది. ఇలా తన కృషికి గుర్తింపుగా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఇటీవలే చోటు దక్కించుకుంది.
హ్యాక్ చేసి ఆటపట్టించాను!
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన కామాక్షికి చిన్నప్పటి నుంచే టెక్నాలజీ అంటే అమితాసక్తి. అందుకు తగ్గట్లే ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే తన స్నేహితుల ఈ-మెయిల్స్ ఖాతాల వివరాలను హ్యాక్ చేసి ఆట పట్టించిన ఆమె... ఆతర్వాత అందులోనే తన కెరీర్‌ను వెతుక్కుంది. ‘2017లో బీటెక్ చదివేటప్పుడు ఘజియాబాద్‌కు చెందిన కొంతమంది పోలీసులు నన్ను సంప్రదించారు. దొంగలించిన మొబైళ్ల ఐపీ అడ్రస్, ఇతర సమాచారం కనుక్కోవడంలో వారితో సహకరించాలని కోరారు. అప్పుడే నా సైబర్ మిషన్ గురించి పోలీసులకు చెప్పాను. మొదటగా అమ్మాయిలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిద్దామని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం స్కూళ్లు, కళాశాలల్లో వరుసగా క్యాంపెయిన్లు నిర్వహించాను. ఈక్రమంలోనే పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ సెల్ సహకారంతో మరిన్ని సాంకేతిక మెలకువలు నేర్చుకున్నాను.’
మనమెందుకు వాళ్లని పట్టుకోకూడదు!
‘సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. మరి అదే టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఎందుకు ఆ మోసగాళ్లను పట్టుకోకూడదు?’ ఈ ఆలోచనతోనే నా సైబర్ మిషన్ మొదలైంది. దిల్లీ ఏసీపీ రాజ్‌పాల్ దాబస్ సర్ సహాయంతో 2019 సెప్టెంబర్‌లో ఈ మిషన్‌ను ప్రారంభించాను. ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర, కన్యాకుమారి... వంటి దాదాపు 30 నగరాల్లో సుమారు 50 వేలమంది పోలీసులకు సైబర్ క్రైమ్ నియంత్రణపై శిక్షణనిచ్చాను. పలు దర్యాప్తు ఏజెన్సీలు, సంస్థలు, ఆర్మీ అధికారులతో కూడా కలిసి పనిచేస్తున్నాను.’
అదే నా కోరిక!
‘సైబర్ నేరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడాలంటే ప్రపంచ దేశాల సైబర్ క్రైం బృందాలన్నీ ఒకే తాటిపైకి రావాలి. దీంతోపాటు నేరస్థులకు సంబంధించిన గత ట్రాక్ రికార్డులు, ఈ నేరాల్ని తుడిచిపెట్టే అస్త్రాలన్నీ వారి దగ్గర ఉండాలి. అప్పుడే ఆన్లైన్ దొంగల కంటే మనం ఒక అడుగు ముందుంటాం. నా లక్ష్యం కూడా ఇదే. ప్రభుత్వం సహకరిస్తే త్వరలోనే ఈ పనికి శ్రీకారం చుడదామనుకుంటున్నాను..’ అంటూ తన సైబర్ మిషన్ గురించి చెప్పుకొచ్చింది కామాక్షి.
తన ప్రతిభా పాటవాలు, నైపుణ్యంతో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కృషి చేస్తోన్న కామాక్షి గతంలో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!