Published : 31/03/2023 00:15 IST

Water-Birds: మూగజీవాల కోసం..

జంతువులంటే జాలిపడని వారు ఎవరుంటారు చెప్పండి! కానీ పొద్దుపొద్దునే సూర్యుడు మండిపోతున్నాడు. మనకైతే మంచినీళ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. మరి మూగజీవాల మాటేంటి? బాల్కనీలో కాసిని నీళ్లు పెట్టండి. పిల్లలకూ భూతదయ అలవడుతుంది..

* ఉదయాన్నే బాల్కనీల్లో పక్షులకు కనపడేలా ఒక ప్లాస్టిక్‌ గిన్నెలో నీటిని పోసి ఉంచండి. వీలైతే వాటి పక్కన కొన్ని గింజలు కూడా పెడితే సరి. రోజుకు రెండు సార్లు ఆ నీటిని మారిస్తే సరిపోతుంది. ఉదయం సాయంత్రం వేళల్లో  పక్షులు ఆహారం వెతుక్కుంటూ గూళ్ల నుంచి బయటకు వస్తాయి.

* మీకు కుదరనప్పుడు పిల్లల్ని నీరు పెట్టేలా ప్రోత్సహించండి. అలా చేయటం వల్ల ఉపయోగమేంటో వివరించండి. మూగజీవుల పట్ల ప్రేమ, బాధ్యత తెలుస్తుంది.

* బాల్కనీల్లోనే కాకుండా వీధిలో తిరిగే జంతువుల కోసం ఒక నీటి తొట్టిని ఏర్పాటు చేయండి. ఉదయం, సాయంత్రం దాన్ని నీటితో నింపండి. ఎన్నో మూగజీవుల దాహం తీర్చినవారవుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని