సంగీతంతో మానసిక రోగులకు స్వాంతన కలిగిస్తా..!

ప్రతి ఒక్కరికీ ఒక్కో కళ ఉంటుంది. కానీ కొంతమంది తమ కళకు మరింత పదునుపెట్టి నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. కేరళకు చెందిన పదేళ్ల పార్వతీ ఉన్నికృష్ణన్‌ అనే అమ్మాయి కూడా ఈ జాబితాలో ఉంటుంది. ఈ అమ్మాయి చిన్న వయసులోనే తబలా వాయించి ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఏకధాటిగా 45 నిమిషాలకు పైగా తబలా వాయించి రికార్డు సృష్టించింది.

Published : 25 Feb 2022 21:12 IST

(Photo: India Book of Records)

ప్రతి ఒక్కరికీ ఒక్కో కళ ఉంటుంది. కానీ కొంతమంది తమ కళకు మరింత పదునుపెట్టి నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. కేరళకు చెందిన పదేళ్ల పార్వతీ ఉన్నికృష్ణన్‌ అనే అమ్మాయి కూడా ఈ జాబితాలో ఉంటుంది. ఈ అమ్మాయి చిన్న వయసులోనే తబలా వాయించి ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఏకధాటిగా 45 నిమిషాలకు పైగా తబలా వాయించి రికార్డు సృష్టించింది. తద్వారా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

పార్వతి స్వస్థలం కేరళలోని ఎర్నాకులం జిల్లా. తండ్రి ఉన్నికృష్ణన్‌, తల్లి అను నిర్మల్‌. పార్వతి ఏడేళ్ల వయసు నుంచే తబలా వాయించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏకధాటిగా 45 నిమిషాల 36 సెకండ్ల పాటు తబలా వాయించింది. తద్వారా ఎక్కువ సమయం పాటు తబలా వాయించిన అమ్మాయిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ ప్రదర్శనలో భాగంగా పార్వతి తబలాలోని అన్ని రకాల సంప్రదాయ రీతులనూ ప్రయత్నించింది.

అదే నా లక్ష్యం!

కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల చాలామంది ఇంటికే పరిమతమయ్యారు. ఇందులో విద్యార్థులు ఎక్కువ కాలం ఇంటి దగ్గరే ఉండాల్సి రావడంతో వారి చదువుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ, పార్వతి మాత్రం ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఒక అవకాశంగా మలచుకుంది. లాక్‌డౌన్‌కు ముందే తబలా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె గురువు ఇంటికొచ్చి తరగతులు చెప్పడంతో లాక్‌డౌన్‌ సమయాన్ని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించుకుంది. అలాగే ఆన్‌లైన్‌లోనూ తబలా తరగతులకు హాజరైంది.

‘మా నాన్నకు తబలాపై ఉన్న మక్కువ నాలో స్ఫూర్తి నింపింది. దాంతో నాలుగు సంవత్సరాల క్రితం నేను తబలా వాయించడంలో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టాను. మా గురువు గారు మా ఇంటికొచ్చి తబలా నేర్పించేవారు. అది లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో ఉపయోగపడింది. హిందుస్థానీ సంగీతం నేర్చుకుని మ్యూజిక్‌ థెరపీ ప్రాక్టీస్‌ చేసి మానసిక రోగుల్లో స్వాంతన కలిగించడమే నా లక్ష్యం’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ చిన్నారి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్