కత్తుల్ని పదునెక్కిస్తుంది..!
కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలా వంటింట్లోని పదార్థాలను కట్ చేయడానికి వేర్వేరు కత్తుల్ని/చాకుల్ని ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే వీటిని కట్ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల కటర్స్, స్లైసర్స్.. వంటి ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కత్తి లేని...
కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలా వంటింట్లోని పదార్థాలను కట్ చేయడానికి వేర్వేరు కత్తుల్ని/చాకుల్ని ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే వీటిని కట్ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల కటర్స్, స్లైసర్స్.. వంటి ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కత్తి లేని కిచెన్ అసంపూర్ణమనే చెప్పుకోవాలి. మరి, కత్తి లేదా చాకుకు వంటింట్లో అంతటి ప్రాధాన్యముంటుంది. అయితే అటువంటి కత్తి పదునుగా లేకపోతే.. ఇక పనైనట్టే..! మరి, దాన్ని సానపట్టించాలన్నా, కొత్త కత్తి కొనాలన్నా కాస్త సమయం పడుతుంది. మరి, అనుకున్నదే తడవుగా.. ఇంట్లోనే నిమిషాల్లో కత్తిని పదునెక్కించే గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటే బాగుంటుంది కదూ! ఇదిగో ఇది అలాంటిదే..
కూరగాయలు కట్ చేయాలంటే కత్తి మధ్య భాగంలో షార్ప్‌గా ఉండాలి.. అదే కార్వింగ్ డిజైన్ చేయాలంటే కత్తి మొనభాగం పదునుగా ఉండాలి.. ఇలా మన అవసరాన్ని బట్టి పదునైన కత్తిని వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మన ఉపయోగాన్ని బట్టి చాకును పదును పెట్టుకునే విధంగా రూపొందించారీ ‘3-స్టేజ్ కిచెన్ నైఫ్ షార్ప్‌నర్’.
ఇందులో కత్తిని ఒకే దిశలో పదును పెట్టాల్సి ఉంటుంది (అంటే.. కత్తిని మొనతో మొదలుపెట్టి చివరి వరకు వచ్చాక.. మళ్లీ మొన దగ్గర నుండే పదును చేయడం మొదలు పెట్టాలన్నమాట). దీన్నే వన్-డైరెక్షన్ షార్ప్‌నర్ అంటారు. ఈ గ్యాడ్జెట్‌లో మూడు రకాల షార్ప్‌నర్స్ ఉంటాయి. ఒక షార్ప్‌నర్ సెరామిక్ రాడ్‌తో తయారుచేసింది. ఇందులో కూరగాయలు, మాంసాన్ని కట్ చేసే కత్తులను పదును చేసుకోవచ్చు. ఇక రెండో షార్ప్‌నర్‌ని ‘డైమండ్ రాడ్’ అంటారు. దీనిని ఉపయోగించి కత్తి మొనలను షార్ప్ చేసుకోవచ్చు. ఇలాంటి కత్తులను ఉపయోగించి కూరగాయలతో వివిధ రకాల డిజైన్స్‌ని తయారుచేయచ్చు. చివరగా టంగ్‌స్టన్ స్టీల్ బ్లేడ్‌తో తయారుచేసిన షార్ప్‌నర్ ఉంటుంది. ఇది చాలా గట్టిది కావడం వల్ల సెరామిక్ బ్లేడ్స్ లాంటివి కూడా దీంతో పదును చేసుకోవచ్చు. దీనితో పాటు వంగిపోయిన మెటాలిక్ బ్లేడ్స్‌ని సైతం తిరిగి యధాస్థితికి తీసుకురావచ్చు.
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.