ఉనికిని కోల్పోవద్దు..!

దసరా శరన్నవరాత్రుల్లో మనం పూజించే ఆ అమ్మవారు శక్తి స్వరూపిణి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో పూజలందుకొనే ఆ అమ్మ ప్రతి స్త్రీకీ ఆదర్శమే. మహిళల శక్తిసామర్థ్యాలకు, దృఢ చిత్తానికి, వ్యవహారశైలికి, సందర్భానుగుణంగా తనని తాను మలచుకునే తీరుకి.....

Published : 04 Oct 2022 18:41 IST

దసరా శరన్నవరాత్రుల్లో మనం పూజించే ఆ అమ్మవారు శక్తి స్వరూపిణి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో పూజలందుకొనే ఆ అమ్మ ప్రతి స్త్రీకీ ఆదర్శమే. మహిళల శక్తిసామర్థ్యాలకు, దృఢ చిత్తానికి, వ్యవహారశైలికి, సందర్భానుగుణంగా తనని తాను మలచుకునే తీరుకి ఆమే ఒక నిదర్శనం. నవరాత్రుల్లో రోజుకి ఒక అలంకారంలో దర్శనమిచ్చే ఆ అమ్మవారికి ఒక్కో రూపంలో ఒక్కో బలం ఉంటుంది. సరస్వతీ దేవిగా విద్యను ప్రసాదిస్తే, కనకదుర్గగా భక్తులను చల్లగా దీవిస్తూ కోరికలు తీరుస్తుంది. మహిషాసురమర్దిని/ కాళిక అవతారాల్లో చెడుని అంతమొందిస్తుంది. ఆ అమ్మవారి నుంచి మనమంతా ఈ అంశాలను నేర్చుకుంటూ మనలోని అపనమ్మకం, నిస్సహాయత, నిస్పృహలను వదిలేస్తూ.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఎంచుకున్న రంగంలో తప్పకుండా రాణించగలం.

దృఢంగా..

మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఆధిపత్య ధోరణి చలాయిస్తే, ఇంకొందరు మన ఆలోచనలు లేదా మనసుని ప్రభావితం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల ప్రభావానికి లోనవకుండా మన వ్యవహారశైలిని దృఢంగా మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మిన సిద్ధాంతాలను, ఆలోచనలను వదిలేస్తూ.. మనదైన వ్యక్తిత్వానికి దూరం కాకూడదు. ఇలా జరిగితే చివరికి మన ఉనికినే కోల్పోవాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి!

ఎలా మాట్లాడుతున్నాం?

అలాగే ఎక్కడ, ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం? ఎలా మాట్లాడుతున్నాం.. అనే విషయాలపై అవగాహన ఉండాలి. అదేవిధంగా ఎదుటివ్యక్తి స్పందించిన తీరుని బట్టి సరైన రీతిలో దీటుగా ప్రతిస్పందించే గుణం అలవరుచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని