ఇంటికో సీతమ్మ తల్లి!
దయ.. ధైర్యం.. వివేకం.. ఆత్మాభిమానం అన్నీ కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు వూహించలేం. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో పరిశోధనలు సైతం చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు....
దయ.. ధైర్యం.. వివేకం.. ఆత్మాభిమానం అన్నీ కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు వూహించలేం. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో పరిశోధనలు సైతం చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం.. ఆమె చరితం ఓ స్ఫూరిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. ఆ మాటకొస్తే- ఈ అల్ట్రా మోడ్రన్ యుగంలో సైతం సీతమ్మ తల్లికి ప్రతీకలుగా నిలిచే మహిళలు ఎందరో! ఎప్పుడో త్రేతా యుగంలోనే కాదు.. ఈ టెక్నాలజీ శకంలోనూ ఇంటికో సీతమ్మ తల్లి వారసురాలు కనిపిస్తుంది.
ధర్మమూర్తి:
ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి 'సీతాదేవి'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధమై ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.
అభిమానవతి:
సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలానగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటికొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులెదురైనప్పటికీ తామే పరిష్కరించుకోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడదన్న అభిమానవతి ఆమె.
జంతు ప్రేమికురాలు:
ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎనలేని ప్రేమ కలిగిన స్త్రీమూర్తి సీత. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థిస్తుంది ఆమె.
దయాశీలి:
పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్ష వేసిన దయామూర్తి ఆమె.
వివేకవంతురాలు:
రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారు నగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.
ప్రేమమూర్తి:
సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే .. ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామ నామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.
చైతన్యశీలి:
సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణుడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పిందామె. అలా అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఞావంతురాలామె.
క్షమాగుణం:
రాక్షస సంహారం తర్వాత సీతను అశోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం.
ధైర్యశాలి:
పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది.
ఆదర్శమూర్తి:
అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.
సీతమ్మ తల్లి గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి లక్షణాన్నీ తమ సొంతం చేసుకుని కుటుంబం మొత్తానికి ఒక దిక్సూచిలా నిలిచే మహిళలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా బెదిరిపోక తమదైన కార్యదక్షతతో, ధైర్య సాహసాలతో, నాయకత్వ లక్షణాలతో, అసమాన ప్రజ్ఞాపాటవాలతో ఇంటా బయటా విజయ బావుటా ఎగరేస్తున్న సీతమ్మ తల్లులందరికీ మరోసారి వందనం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!