Published : 20/03/2023 00:24 IST

Susmita Sen: సుస్మిత చెబుతున్న.. పాఠమిది

న్నె తరగని అందం, ఫిట్‌నెస్‌లకి పర్యాయపదం సుస్మితా సేన్‌! అలాంటి ఆమె ‘గుండెనొప్పి నుంచి కోలుకున్నా’నని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. మగవారికే ఎక్కువ గుండెజబ్బులు వస్తాయి. ఆడవాళ్లకి, ఆరోగ్యంగా కనిపించే వారికి ఇది త్వరగా దరిచేరదు అన్నవి అపోహలే అని ఆమె అనుభవం నిరూపిస్తోంది. ‘గుండె నాళాల్లో 90 శాతం పూడికలు ఏర్పడ్డాయి. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే కాపాడగలిగా’మని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి.. ‘రోజులో వ్యాయామాన్ని తప్పనిసరి భాగం చేసుకోండి. అలాగని శరీరాన్ని కష్టపెట్టొద్దు. వారంలో 3-4 రోజులు వ్యాయామానికి కేటాయిస్తే చాలు. రోజూ తప్పనిసరిగా చేయాలన్న నియమంతో శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోయినా హార్మోనుల్లో తేడాలొస్తాయి. ఇదీ ప్రమాదమే. చాలామంది నిద్రకు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇతరుల మెప్పు కోసం గంటలకొద్దీ జిమ్‌కి కేటాయించేవారూ లేకపోలేదు. తగినంత నిద్ర లేకుండా చేసే వ్యాయామమూ గుండెకు ముప్పుగా పరిణమించొచ్చు’ అంటున్నారు వైద్యులు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర, వ్యాయామం మూడింటికీ ప్రాధాన్యమిస్తేనే గుండెను కాపాడుకోవచ్చు అని సలహానిస్తున్నారు. తన గుండె నొప్పి విషయాన్ని చెప్పేప్పుడు ‘నీ గుండెను ధైర్యం, సంతోషంతో నింపుకో’ అన్న వాళ్ల నాన్న మాటల్ని కోట్‌ చేసింది సుస్మిత. ఎంత శారీరకంగా కష్టపడ్డా మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఒత్తిడి వంటివి ఉంటే అవీ గుండె నొప్పికి దారితీస్తాయట. కాబట్టి.. ఆడాళ్లూ.. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయక వేళలకు తినండి. అనవసర ఒత్తిడి, ఆందోళనలకు తావివ్వక మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. సుస్మిత పరిస్థితి మనకు చెబుతున్న పాఠాలే ఇవి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని