హర హచి బు.. షిన్రిన్-యోకు.. వారి సెంచరీ సీక్రెట్లు!
చాలామంది ఆరు పదులు దాటగానే ఆపసోపాలు పడుతుంటారు. పని చేయడానికి శరీరం సహకరించట్లేదంటుంటారు. కానీ వందేళ్లు దాటినా వయసులో ఉన్న వారిలా చలాకీగా ఉండే బామ్మలు చాలా అరుదుగా ఉంటారు. జపాన్‌కు చెందిన కేన్ తనకా ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
చాలామంది ఆరు పదులు దాటగానే ఆపసోపాలు పడుతుంటారు. పని చేయడానికి శరీరం సహకరించట్లేదంటుంటారు. కానీ వందేళ్లు దాటినా వయసులో ఉన్న వారిలా చలాకీగా ఉండే బామ్మలు చాలా అరుదుగా ఉంటారు. జపాన్‌కు చెందిన కేన్ తనకా ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇటీవలే 119వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ గ్రానీ.. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఇదే ఉత్సాహంతో ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. తనొక్కర్తే కాదు.. జపాన్‌లో దాదాపు 86 వేల మందికి పైగా వందేళ్లకు పైబడిన వారేనని గణాంకాలు చెబుతున్నాయి. మరి, ‘సెంచరీలు కొట్టే ఫిట్నెస్ మాది’ అంటోన్న ఈ జపనీయుల ఆరోగ్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
‘హర హచి బు’ రూల్..
మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపించం. పెద్దవాళ్లు కూడా మనకు కడుపు నిండా తినాలని చెబుతుంటారు. కానీ, జపాన్ ప్రజలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఆహారం తీసుకునే విషయంలో అక్కడి ప్రజలు ‘హర హచి బు’ అనే పద్ధతిని ఫాలో అవుతుంటారట! జపాన్‌లో ఇది చాలా పాపులర్ పదం. దీని ప్రకారం.. వాళ్లు 80 శాతం మాత్రమే కడుపు నింపు కొంటారట! ఉదాహరణకు 10 అరటిపండ్లు తింటే కడుపు నిండుతుందనుకుంటే వారు 8 అరటిపండ్లతోనే సరిపెట్టుకుంటారట! ఈ పద్ధతిని జపాన్‌లోని ఒకినావా ప్రజలు ఎక్కువగా పాటిస్తుంటారు. అంతేకాదు.. ఆహారాన్ని నెమ్మదిగా, ఆస్వాదిస్తూ తినడం, చిన్న పరిమాణంలో ఉండే ప్లేట్లను ఉపయోగించడం.. వంటి నియమాల్ని కూడా కచ్చితంగా పాటిస్తుంటారట! ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు అందడంతో పాటు, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, స్థూలకాయం.. వంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండడంతో పాటు శరీర బరువు కూడా అదుపులో ఉంటుందంటున్నారు.
‘మచా టీ’ని ఆస్వాదిస్తూ..!
జపాన్ ప్రజలు మచా టీ రుచిని ఎక్కువగా ఆస్వాదిస్తుంటారట! మన దగ్గర దీనిని గ్రీన్ టీ అంటారు. అయితే దీనిలో పోషకాల సంఖ్య పెరిగేలా చేయడానికి అక్కడి రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారట! ఈ క్రమంలో పంట చేతికి రావడానికి సుమారు నెల రోజుల ముందు నుంచే టీ తోటకు నేరుగా ఎండ తగలకుండా చేసి.. వాటి ఆకుల్లో క్లోరోఫిల్ ఉత్పత్తి పెరిగేలా చేస్తారట! తద్వారా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడంతో పాటు ఇందులోని అమైనో ఆమ్లాలు, ఇతర సమ్మేళనాల శాతం పెరుగుతుంది. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి, కాలేయ పనితీరు మెరుగుపడడానికి.. ఇలా వివిధ రకాలుగా దోహదం చేస్తాయన్నమాట! ఇక దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు డ్యామేజ్ కాకుండా చేసి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. అలాగే ఈ టీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయలు దరి చేయకుండా కాపాడుతుంటుంది. రోగనిరోధక శక్తిని, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, మానసిక ఆరోగ్యానికి.. ఇలా ఈ టీతో లేని ప్రయోజనం లేదంటే అతిశయోక్తి కాదు.
సముద్రపు ఆహారం..
జపాన్ చుట్టూ సముద్రమే. కాబట్టి, ఇక్కడ సముద్రపు ఆహారం ఎక్కువగా లభిస్తుంది. అందుకే వీరు సీఫుడ్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సముద్రపు నాచును ఇక్కడి ప్రజలు ఎక్కువగా తీసుకుంటుంటారు. దీంతో రుచికరమైన వంటకాలు కూడా తయారుచేసుకుంటారట జపాన్ వాసులు. దీనిలో ప్రొటీన్లు, అయొడిన్, సోడియం, క్యాల్షియం.. వంటి ఎన్నో పోషకాలు లెక్కకు మించి ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచడానికి, అధిక బరువు నుంచి విముక్తి కలిగించడానికి.. ఇలా సముద్రపు నాచుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఈ నాచుతో పాటు ప్రొటీన్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే చేపలను అధికంగా తీసుకుంటారు. అందుకే ఇక్కడి వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువట!
ప్రకృతికి దగ్గరగా...
జపాన్‌లో ఎక్కువమంది ప్రజలు షిన్రిన్-యోకు (ఫారెస్ట్ బాతింగ్) అనే పద్ధతిని పాటిస్తుంటారు. ఫారెస్ట్ బాతింగ్ అంటే పచ్చటి ప్రకృతిలో గడపడమని అర్థం! ఇందుకోసం వారు రోజులో కొంత సమయాన్ని వెచ్చిస్తుంటారు. అంతేకాదు.. ఈ ఫారెస్ట్ బాతింగ్ కోసం జపాన్‌లో ప్రత్యేకంగా కొన్ని ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. అవి అందుబాటులో లేని వారు దగ్గర్లోని పార్క్‌లకు వెళుతుంటారు. ఈ పద్ధతిని వారు ప్రకృతి వైద్యంగా పరిగణిస్తుంటారు. ఇక ఈ సమయంలో వాళ్లు గ్యాడ్జెట్లను సైతం పక్కన పెట్టేస్తుంటారట! ఇలా చేయడం వల్ల ధ్యానం చేసినంత ఫలితం కలుగుతుందంటున్నారు నిపుణులు. తద్వారా ఆందోళన, ఒత్తిడి, కోపం.. వంటి సమస్యలు దూరమవుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. రోజూ 20 నిమిషాలు లేదా వారంలో రెండు గంటలు ప్రకృతితో గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి జీవితంలో సంతృప్తి పెరిగినట్లు అక్కడ నిర్వహించిన కొన్ని సర్వేల్లో స్పష్టమైంది కూడా!
ఆరోగ్యానికి ‘సీజా భంగిమ’!
ఈ రోజుల్లో వచ్చే చాలా జబ్బులు అనారోగ్యపూరిత జీవనశైలి వల్లే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఈ విషయంలో జపాన్ వాసులు మరింత జాగ్రత్త వహిస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తుంటారు. దీనివల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దూరమవడంతో పాటు మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. మన దగ్గర వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగించడం ఫ్యాషనబుల్‌గా భావిస్తుంటారు చాలామంది. అయితే ఇండియన్ స్టైల్ టాయిలెట్ పద్ధతే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల మోకాళ్లు, కీళ్లు దృఢంగా ఉండి ఆయా భాగాల్లో నొప్పులు రాకుండా ఉంటాయట. అందుకే జపాన్ వాసులు కూడా ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తుంటారట. అలాగే దగ్గరి ప్రదేశాలకు వెళ్లడానికి నడక లేదంటే సైకిల్ని ఉపయోగిస్తుంటారట! ఇక అక్కడి రైళ్లలోనూ తక్కువ సీట్లే ఉంటాయట! కాబట్టి చాలామంది నిలబడే ప్రయాణం చేస్తుంటారు. ఇక అక్కడ ఎక్కువ శాతం ప్రజలు సీజా భంగిమ(మోకాళ్లపై)లో కూర్చుంటారట. ఇలా రోజువారీ దినచర్యలో సాధ్యమైనంత వరకు శరీరానికి వ్యాయామం అందేటట్లు చూసుకుంటారు జపనీయులు. దానివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు వారి ఆయుష్షు కూడా పెరుగుతుందట!
కుటుంబంతోనే గడుపుతారు!
జపాన్‌లో ఆరోగ్య వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆయా వయసుల్లో అందాల్సిన వ్యాక్సిన్లు పక్కాగా ఇస్తుంటారు. ఇక్కడి ప్రజలకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. హెల్త్ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ.. వీటి ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన సలహాలు, సూచనలు నిపుణుల సహాయంతో ప్రజలకు వివరిస్తుంటారు. ఉప్పు వినియోగం తక్కువగా, పరిసరాల పరిశుభ్రత ఎక్కువగా పాటించడం జపనీయులకు అలవాటు! వారి జీవిత కాలం పెరగడానికీ ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు.
ఇక మన దగ్గర కొంతమంది వయసు మళ్లిన వారిని భారంగా భావిస్తూ వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తుంటారు. కానీ, జపాన్ ప్రజలు ఇందుకు విరుద్ధం. అక్కడ వృద్ధులు వారి కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. ఇలా చేయడం వల్ల వారికి మానసిక ప్రశాంతత చేకూరి ఎక్కువ కాలం జీవించేందుకు కారణమవుతుందట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!