Tanishka: సీజేఐ కావాలన్నదే లక్ష్యం

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన తనిష్క సుజిత్‌ పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలై 13వ ఏటే   ఇంటర్‌ పూర్తి చేసింది.

Published : 12 Apr 2023 00:48 IST

15 ఏళ్లకే డిగ్రీ పరీక్షలు రాస్తున్న తనిష్క

ధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన తనిష్క సుజిత్‌ పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలై 13వ ఏటే   ఇంటర్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఈ నెల 19 నుంచి మధ్యప్రదేశ్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ పరిధిలో జరిగే బీఏ(సైకాలజీ) చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతోంది. 2020లో కరోనాతో తండ్రి మరణించినా తల్లి అనూభ సంరక్షణలో ఉంటూ చదువులో రాణిస్తోంది. ఈ నెల 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ పర్యటన సందర్భంగా ఆయనతో సుజిత్‌ 15 నిమిషాలు ముచ్చటించి తాను బీఏలో ఉత్తీర్ణత సాధించి.. అమెరికాలో న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నానని చెప్పింది. ఎప్పటికైనా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని కావాలన్న తన కలను నెరవేర్చుకుంటానని తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్