Summer Beauty: మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే..!

చెమట, ఉక్కపోత.. వేసవి సమస్యల వలయంలో అందాన్ని సంరక్షించుకోవడం అంత ఈజీ కాదు. ఇక మేకప్‌ వేసుకునే వారికి ఈ విషయంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం...

Published : 04 May 2023 20:49 IST

చెమట, ఉక్కపోత.. వేసవి సమస్యల వలయంలో అందాన్ని సంరక్షించుకోవడం అంత ఈజీ కాదు. ఇక మేకప్‌ వేసుకునే వారికి ఈ విషయంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి సందర్భాలలో ఈ కాలంలోనూ మేకప్‌ను ఎక్కువ సమయం నిలిపి ఉంచుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా తాజాగా, ప్రకాశవంతంగా మెరిసిపోవచ్చంటున్నారు. అదెలాగో చూద్దాం రండి..

వేసవిలో ఎంత లైట్‌గా మేకప్‌ వేసుకుంటే అంత మంచిది. అది కూడా జెల్‌ లేదా నీటి ఆధారిత మేకప్‌ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ఎండ వేడికి కరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు.

మేకప్‌ వేసుకోవడానికి అరగంట ముందు ఐస్‌క్యూబ్‌తో మర్దన చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో ఒక మస్లిన్‌ క్లాత్‌లో ఐస్‌క్యూబ్‌ను చుట్టి.. ముఖంపై నెమ్మదిగా రుద్దుకోవాలి. ఇది అధిక చెమటను తగ్గించి.. మేకప్‌ చెరిగిపోకుండా చేస్తుంది.

ఎండ వేడికి ఫౌండేషన్‌ త్వరగా కరిగిపోతుంది. కాబట్టి దీనికి బదులు సీసీ క్రీమ్‌ ఉపయోగించడం మేలు.

ప్రైమర్‌ కూడా వేడికి మేకప్‌ కరిగిపోకుండా కాపాడుతుంది. అయితే వీటిలోనూ నీటి ఆధారిత ఉత్పత్తుల్ని ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం ఇవి స్ప్రే తరహాలో కూడా లభిస్తున్నాయి.

ఈ కాలంలో కంటి మేకప్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాటుకకు బదులు వాటర్‌ప్రూఫ్‌ లిక్విడ్‌ లైనర్, మ్యాట్ తరహా ఐషాడో ప్రైమర్‌.. వంటివి ఎంచుకుంటే వేడికి కరిగిపోకుండా సంరక్షిస్తుంది.

మేకప్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా ఈ కాలంలో సన్‌స్క్రీన్ మాత్రం తప్పనిసరి. అయితే మేకప్‌ వేసుకునే వారు దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే స్ప్రే తరహాది ఎంచుకోవడం మంచిది. మేకప్‌ పూర్తయ్యాక సన్‌స్క్రీన్‌ను స్ప్రే చేసుకుంటే మంచిది.

వేసవిలో టి-జోన్‌ (నుదురు, ముక్కును కలిపే ప్రాంతం) ఎక్కువ జిడ్డుగా కనిపిస్తుంటుంది. కాబట్టి మేకప్‌ పూర్తయ్యాక ఈ భాగంలో మరోసారి పౌడర్‌తో రీటచ్‌ ఇవ్వడం మర్చిపోవద్దు.

ఈ కాలంలో షిమ్మర్‌ (మెరుపు ఆధారిత) మేకప్‌ ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే సహజసిద్ధమైన లుక్‌ని సొంతం చేసుకోవచ్చు.

ఇక మేకప్‌ పూర్తయ్యాక సెట్టింగ్‌ స్ప్రేను ఉపయోగిస్తే.. మేకప్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండడంతో పాటు తాజా లుక్‌ మీ సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్