తనే బావిని తవ్వింది.. గ్రామానికి నీటిని తెచ్చింది!
అసాధారణ పట్టుదలతో ఆనాడు శివుడి శిరస్సుపైనున్న గంగను నేలకు దించాడు భగీరథుడు. ఇప్పుడు అలాంటి కృషితోనే అపర భగీరథుడిగా పేరు తెచ్చుకుంది ఒడిశాకు చెందిన మాలతి శిశ. నీటి ఎద్దడితో గొంతెండిపోతోన్న తన కుటుంబం, గ్రామ ప్రజల కోసం ఏకంగా బావిని తవ్వేసిందీ గిరిజన అమ్మాయి.
అసాధారణ పట్టుదలతో ఆనాడు శివుడి శిరస్సుపైనున్న గంగను నేలకు దించాడు భగీరథుడు. ఇప్పుడు అలాంటి కృషితోనే అపర భగీరథుడిగా పేరు తెచ్చుకుంది ఒడిశాకు చెందిన మాలతి శిశ. నీటి ఎద్దడితో గొంతెండిపోతోన్న తన కుటుంబం, గ్రామ ప్రజల కోసం ఏకంగా బావిని తవ్వేసిందీ గిరిజన అమ్మాయి. ముగ్గురు చెల్లెళ్లతో కలిసి సుమారు మూడు నెలల పాటు శ్రమించి 20 అడుగుల లోతులో ఉన్న గంగా జలాన్ని ఒడిసిపట్టుకుంది.
గొంతు తడుపుకోవాలంటే 2 కిలోమీటర్లు!
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా బండిగూడ గ్రామ ప్రజలు గత కొన్నేళ్లుగా తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్నారు. తాగునీటి సరఫరా కోసం ఆ గ్రామంలో ఏర్పాటుచేసిన తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. గొంతు తడుపుకోవాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీనికి తోడు కొండ ప్రాంతం కావడంతో అధికారుల పర్యవేక్షణ కూడా కరువైంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా ఫలితం లేకపోయింది.
ముగ్గురు చెల్లెళ్లతో కలిసి!
ఇదే గ్రామానికి చెందిన మాలతి చిన్నప్పటి నుంచి ఇలాంటి సమస్యలు చూస్తూనే పెరిగింది. గ్రామానికి దూరంగా జయపురంలో ఎం.ఏ. చదువుతున్నప్పటికీ స్థానిక సమస్యలపై ఆమెకు బాగా అవగాహన ఉంది. ఈ క్రమంలోనే గ్రామంలోని రహదారులు, ఆరోగ్యం, పాఠశాలలతో పాటు ప్రధానమైన తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని విన్నవిస్తూ అధికారులకు పలుసార్లు లేఖలు రాసింది. అయినా ఎవరూ కన్నెత్తి చూడలేదు. దీంతో విసిగి వేసారిన ఆమె తన ఇంటి సమీపంలో ఓ బావిని తవ్వాలనుకుంది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులతో చర్చించి పని మొదలు పెట్టింది. ఇందుకు తన ముగ్గురు చెల్లెళ్ల సహాయం కూడా తీసుకుంది. మూడు నెలల పాటు కష్టపడి 20 అడుగుల మేర బావిని తవ్వగా వారికి నీటిజాడ కనిపించింది.
మొదట్లో కొంచెం కష్టమనిపించింది!
‘నేను గతేడాది లాక్డౌన్ నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇక్కడి ప్రజలు తీవ్ర తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. అధికారులకు విన్నవించినా అరణ్య రోదనే అయింది. దీనికి ఓ శాశ్వత పరిష్కారం కనుగొనే క్రమంలోనే బావి తవ్వాలన్న ఆలోచన వచ్చింది. అమ్మానాన్న, ముగ్గురు చెల్లెళ్లు కూడా నా నిర్ణయాన్ని సమర్థించారు. తవ్వడం ప్రారంభించిన మొదట్లో కొంచెం కష్టమనిపించినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు మా కుటుంబంతో పాటు గ్రామస్తులు కూడా ఈ బావి నీటినే వినియోగించుకుంటున్నారు. ఈ నీటి సహాయంతోనే కొన్ని రకాల కూరగాయలు కూడా సాగుచేస్తున్నాం’ అని అంటోంది మాలతి.
ఆ మార్గంలోనే మరికొందరు!
అధికారులపై ఆధారపడకుండా తన గ్రామంలోని నీటి సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని చూపింది మాలతి. గత 20 రోజుల నుంచి ఆమె కుటుంబంతో పాటు పలువురు గ్రామస్తులు ఈ బావి నీటినే వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మాలతిని చూసి మరికొంతమంది యువత ముందుకొస్తున్నారు. సొంతంగా బావులు తవ్వుకుని తమ దాహార్తిని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!